Shrasti Verma on Jani Master : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కంప్లీట్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం జానీ మాస్టర్ కేస్. ఒక లేడీ కొరియోగ్రాఫర్ ని మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తూ, అనేక అసాంఘిక కార్యకలాపాలకు గురి చేసాడు అని చెప్పి బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్లు, ఈ కేసు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కొత్త కొత్త విషయాలు ఈ కేసులో బయటకు వస్తున్నాయి. ఈ కేసులో భారీ ప్రాజెక్టులు, బడా దర్శకులు, బడా నిర్మాతలుతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే అప్పుడు వార్తలు వచ్చాయి.
జానీ మాస్టర్ ఢీ జడ్జిమెంట్
అప్పట్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ జానీ మాస్టర్ ను అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది పలు రకాల వ్యాఖ్యలు చేశారు. కొంతమంది బాధితురాలు వైపు సపోర్ట్ చేయటం మొదలు పెడితే ఇంకొంతమంది బాధితురాలు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండటానికి కారణం ఏమిటి ఆమె వెనక ఎవరో పెద్దవారు ఉండి జానీ మాస్టర్ ఇరికిస్తున్నారు అంటూ కొంతమంది వెర్షన్ తెలియజేస్తున్నారు. ఏదేమైనా గతంలో జరిగిన ఢీ జోడి, ఢీ ఛాంపియన్ రియాల్టీ షోస్ లో జానీ మాస్టర్ బాధితురాలు పెర్ఫామెన్స్ కి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడు అని క్యూరియాసిటీ చాలామందిలో వచ్చి కొన్ని ఎపిసోడ్స్ కూడా చూశారు.
బాధితురాలు వెర్షన్
ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ బయట ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాలలో జానీ మాస్టర్ బయటికి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడారు. అంతేకాకుండా చట్టం తన పని తాను చేసుకుంటుందని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. తాజాగా బాధితురాలు రీసెంట్ గా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అనేకమైన సంచలన విషయాలను రివీల్ చేసింది. ఎవరైనా గురువు తన శిష్యుడు ఎదుగుతున్నారు అంటే సంతోషపడాలి కానీ ఫీల్ అవ్వకూడదు. మనమే సినిమా చేసినప్పుడు ఏమి అనని వాళ్లు పుష్ప సినిమా చేస్తున్నప్పుడు నన్ను చాలా మాటలు అన్నారు. జానీ మాస్టర్ భార్య వచ్చి నన్ను కొట్టారు. అంతేకాకుండా రిహాసల్స్ చేస్తున్న టైంలో నా స్టూడియో కు వచ్చి మీరు అందరూ బయటికి వెళ్లిపోండి ఈ అమ్మాయి తో నేను మాట్లాడాలి అంటూ అందరినీ బయటికి పంపించారు. అలాంటి టైంలో ఒక అమ్మాయి ఏం చేస్తుంది. ఇప్పటివరకు చెప్పని అమ్మాయి ఇప్పుడెందుకు ఈ విషయాలన్నీ చెప్తుంది అని చాలామంది అప్పట్లో కామెంట్ చేశారు. అప్పుడు నేను ఏం చేయగలను నాకంటూ తెలిసిన వారు ఎవరూ లేరు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లిపోకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను నిలబడ్డాను అంటూ తనదైన వెర్షన్ తెలిపింది.
Also Read : Choreographer SriRam : ఇంట్లో అగ్రి ప్రమాదం… అక్కడిక్కడే ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి