BigTV English

Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన అసిస్టెంట్..

Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన అసిస్టెంట్..

Johny master : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నెల వరకు జైల్లో ఉన్న ఆయన బెయిల్ పై రీసెంట్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు అయింది.. తనేంటో నిరూపించుకుంటాననీ తన నిర్దోషిత్వాన్ని బయటపెడతానని జానీ మాస్టర్ బయటికి వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఆయన అసిస్టెంట్ శ్రేష్ఠ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ వచ్చింది. అందులో తనపై వస్తున్న ఆరోపణలపై సంచల వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


శ్రేష్ఠ వర్మ ఇంటర్వ్యూ.. 

తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రేష్ట తన పై వస్తున్న ఆరోపణల గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. నేను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకమ్మాయిని నిందితురాలిగా ఎందుకు చూస్తారు. ఒక ఫైటర్ గా ఎందుకు చూడరు అంటూ ఆమె ప్రశ్నించారు. నేను జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని ఆశపడుతున్నాను. నాలాగా ఏ అమ్మాయి బాధపడకూడదు ఇబ్బందులు పడకూడదని నేను ఇలా ముందుకొచ్చానని శ్రేష్ట అన్నారు. సమాజం ఏదో అంటుంది. ఫ్యామిలీ ఏదో అంటుంది. స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు..


జానీ మాస్టర్ పై కేసు పెట్టడానికి కారణాలు..? 

జానీ మాస్టర్ నా విషయంలో పెద్ద తప్పు చేశారు అందుకే నేను ఆయనపై కేసు పెట్టాను. అంతేకానీ ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేదు, వేరే వాళ్ళు ఎవరూ లేరు అని శ్రేష్ట అన్నారు. నా విషయంలో ఎన్నో జరిగాయి. నాదే తప్పంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. నేను డబ్బు కోసమేదంతా చేశానని హనీ ట్రాప్ చేస్తానని చాలామంది అన్నారు నాకు అన్ని తెలుసు అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను అని ఆమె అన్నారు. ఇక నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొంటే ఇప్పుడేందుకు కేసు పెట్టారని అడుగుతున్నారు. కానీ ఒకమ్మాయి ఈ విషయం బయటకు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. నాకు అప్పుడు ధైర్యం సరిపోలేదు. కానీ పదే పదే అవే వేధింపులు జరుగుతుంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు.. హానీట్రాఫ్ చేశా. బ్లాక్ మెయిల్ చేశా, డ్రగ్స్ తీసుకున్నా అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు.. పదహారేళ్ళ వయసులో నేను హనీ ట్రాప్ చేయాలా లేకపోతే అతన్ని ఎలా లోబర్చుకోవాలని ఆలోచనలు వస్తాయా అది మీరు చెప్పండి అని శ్రేష్ట ప్రశ్నించింది. ఇక ఈ కేసు కోర్టులో ఉంది. అందుకే చాలా విషయాలు చెప్పలేను. అమ్మాయిలను తప్పుచేసినవారిగా చూడొద్దు అని సమాజానికి చెప్పడానికి మాత్రమే ఇంటర్వ్యూకు వచ్చాను.. ఇక తన పెళ్లి గురించి ప్రశ్న అడగ్గా.. ఆమె ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అంటున్నారు నా ధైర్యాన్ని మిర్చి నా భార్య ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానని ప్రస్తుతం అయితే పెళ్లి అని ఆలోచన లేదని శ్రేష్ట వర్మ అన్నారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×