E-Paper
Advertisement

OTT Movie : లేని చెల్లిని ఊహించుకుంటూ భర్తతో అలాంటి పని… దిమ్మతిరిగే ట్విస్టులున్న క్రేజీ థ్రిల్లర్

OTT Movie : లేని చెల్లిని ఊహించుకుంటూ భర్తతో అలాంటి పని… దిమ్మతిరిగే ట్విస్టులున్న క్రేజీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ కు ఈరోజుల్లో ప్రజలు ఎంతగా అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో, ఇది మరింతగా వ్యాప్తి చెందింది. వీటిలో ఓటీటీలో వస్తున్న సినిమాలతో, ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 2023 లో వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్విస్ట్ లతో అదరగొట్టింది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తత్సమ తద్భవ‘ (Tatsama Tadbhava). 2023లో విడుదలైన ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, వాసుకి వైభవ్ సంగీతం అందించారు.  పిబి స్టూడియోస్, అన్విత్ సినిమాస్ బ్యానర్‌పై స్పూర్తి అనిల్, చేతన్ నంజుండయ్యతో కలిసి పన్నగ భరణ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మేఘనా రాజ్, ప్రజ్వల్ దేవరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. తన భర్త కనిపించకుండా పోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించిన ఒక యువతి ఎదుర్కొన్న సంఘటనలతో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ 15 సెప్టెంబర్ 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

హారిక అనే మహిళ తన భర్త కనపడటం లేదని, పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఈ క్రమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. హారికకి ఒక నిధి అనే కూతురు కూడా ఉంటుంది. తన తండ్రి ఎలా మిస్ అయ్యాడని తల్లిని అడిగితే, తను ఏం సమాధానం చెప్పకుండా అలాగే ఉంటుంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి వచ్చి, తన గర్ల్ ఫ్రెండ్ అకీరా కనపడట్లేదని చెప్తాడు. ఇన్స్పెక్టర్ కి అతని గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసి ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఆ ఫోటో మరి ఎవరిదో కాదు హారికది. ఈ క్రమంలోనే హారికను మళ్ళీ స్టేషన్ కి పిలిపిస్తాడు. ఆ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం, వీళ్ళిద్దరూ ట్విన్స్ అని, అకిరాని హారికే ఏమైనా చేసి ఉంటుందని చెప్పి ఉంటాడు. ఒకానొక సమయంలో హారిక మీద డౌట్ పడతాడు ఇన్స్పెక్టర్. ఆమెకు పోలిగ్రాఫ్ టెస్టులు కూడా చేస్తాడు. అందులో ఆమె ప్రతి ఒక్కదానికి నార్మల్గా సమాధానం చెబుతుంది.

అయితే అకిరా పేరు వినగానే హారికకి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమెను ఇంటికి పంపి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ కి ఈ కేసులో దిమ్మతిరిగే ట్విస్టులు ఎదురవుతాయి. నిజానికి అకిరా అనేది ఒక కల్పిత పాత్ర. హారిక చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటంతో, తనకు ఒక చెల్లి ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతుండటంతో, ఇది ఎక్కువగా ముదిరిపోతుంది. అందుకే తనకు ఒక చెల్లి ఉన్నట్టు ఊహించుకుంటూ బ్రతుకుతుంది. అయితే అకిరాలాగా ఉన్నప్పుడు, హారికకి ఏమీ గుర్తు ఉండదు. అకిరా లాగా ఉన్నప్పుడే, తనకే తెలియకుండా తన భర్తని ప్రేమిస్తుంది. అప్పుడు హారికని దూరం పెడుతూ అకీరాకి దగ్గరవుతాడు భర్త. అకిరా తనలో ఉన్న ఒక రూపం అని తెలియక, హారిక బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే హారిక భర్త మిస్ అవుతాడు. చివరికి హారిక భర్త ఎలా మిస్ అవుతాడు? ఆమెకు ఉన్న మానసిక ప్రాబ్లం నయం అవుతుందా? చివరికి పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ట్విస్టులతో అదరగొట్టే ‘తత్సమ తద్భవ’ (Tatsama Tadbhava) మూవీని చూడాల్సిందే

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×