BigTV English

OTT Movie : ఆ ఊర్లో ఒకేసారి అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్… మెంటలెక్కించే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

OTT Movie : ఆ ఊర్లో ఒకేసారి అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్… మెంటలెక్కించే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ నుంచి వస్తాయి. వీటికి బడ్జెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. ఈ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లిపోతాయి. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకుంటాయి. ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక ఊరి మహిళలంతా ప్రెగ్నెంట్ అవుతారు. ఆ పిల్లలు చేసే విన్యాసాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘విలేజ్ ఆఫ్ ది డామ్నెడ్‘ (Village of The Damned).  1995లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీకి జాన్ కార్పెంటర్ దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్టోఫర్ రీవ్, కిర్‌స్టీ అల్లీ, లిండా కోజ్లోవ్‌స్కీ, మైఖేల్ పారే నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్  అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అమెరికాలోని ఒక విలేజ్ ప్రాంతంలో ఒక పార్టీ జరుగుతుంది. ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఆడుతూ పాడుతూ, ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు. ఈ విషయం అక్కడ ఉన్న అధికారులకు తెలుస్తుంది. ఆరోజు సాయంత్రం వరకు వాళ్లు అలాగే పడిపోయి ఉంటారు. సాయంత్రం మెలుకవలోకి వచ్చిన వాళ్ళు, తమకు ఏమైందని భయపడతారు. నిద్రలోకి జారుకున్న వారిలో హీరో భార్య కూడా ఉంటుంది. సిటీ నుంచి వచ్చిన హీరో, భార్యను ఏమైందని అడుగుతాడు. ఆ సమయంలో తమకు ఏమీ గుర్తు లేదని చెప్తుంది. ఆ తర్వాత ఈ సమస్య మెల్లమెల్లగా కనుమరుగవుతూ వస్తుంది. ఈ ఘటన జరిగిన తొమ్మిది నెలల తర్వాత ఆ ఊరిలో మహిళలంతా ప్రెగ్నెంట్ అవుతారు. అక్కడ ఉన్న ప్రభుత్వం ఇలా ఎందుకు జరిగిందని మీటింగ్ కూడా పెడుతుంది. కొద్దిరోజులు ఆ పిల్లలు టీనేజ్ కి వస్తూ ఉంటారు. వీళ్లకు హీరో స్కూల్ టీచర్ గా పాఠాలు చెబుతూ ఉంటాడు. హీరో భార్య కూడా ఈ క్రమంలోనే ఒక బిడ్డను కని ఉంటుంది. ఈ పిల్లలు మిగతా పిల్లలులా కాకుండా చాలా తెలివిగా ఉంటారు. తమకి నచ్చని వాళ్లను హిప్నటైజ్ చేసి చంపుతూ ఉంటారు. ఆ ఊరిలో చాలామంది ఇలా చనిపోతారు.

ఈ విషయం గవర్నమెంట్ కి తెలిసి పిల్లలందరినీ చంపాలనుకుంటుంది. అక్కడికి వచ్చిన ఆర్మీ ని కూడా ఈ పిల్లలు హిప్నోటైజ్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత హీరో ఒక ప్లాన్ వేసి, వీళ్ళు చదువుకునే టేబుల్ కింద పెద్ద బాబు పెడతాడు. అయితే ఆ పిల్లలకు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకునే శక్తి ఉంటుంది. హీరో మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఆ శక్తి ఉందన్న విషయం గ్రహించిన హీరో, ఎప్పటినుంచో తన మనసులో ఒక గోడ ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటాడు. ఈ పిల్లలు ఎంత ప్రయత్నించినా, అతని మనసులో ఏముందో గ్రహించలేక పోతారు. ఆ విషయం తెలిసేలోగా, ఆ బాంబు పేలి పిల్లలందరూ చనిపోతారు. చివరికి ఆ ఊరి సమస్య తీరిపోతుందా? నిజంగానే అందరు పిల్లలు చనిపోతారా? ఆ ఊరి మహిళలు ఒకేరోజు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘విలేజ్ ఆఫ్ ది డామ్నెడ్’ (Village of The Damned) మూవీని చూడాల్సిందే?

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×