BigTV English

Shreya Ghoshal : శ్రేయా ఘోషల్ అకౌంట్ హ్యాక్… ఇన్ని రోజులు ఏం చేశావ్ తల్లీ

Shreya Ghoshal : శ్రేయా ఘోషల్ అకౌంట్ హ్యాక్… ఇన్ని రోజులు ఏం చేశావ్ తల్లీ

Shreya Ghoshal : బాలీవుడ్ లో బెస్ట్ సింగర్ గా పేరు తెచ్చుకున్న స్టార్ సింగర్ శ్రేయా (Shreya Ghoshal) సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఫిబ్రవరి 13 నుండి తన ఖాతా హ్యాక్ అయిందని, అప్పటి నుంచి ఎంతగా ప్రయత్నించినా  మళ్ళీ తన ట్విటర్ అకౌంట్ ను తిరిగి పొందలేకపోయానని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది.


శ్రేయా ఘోషల్ అకౌంట్ హ్యాక్ 

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ లో శ్రేయా  ‘ఫ్రెండ్స్… ఫిబ్రవరి 13న నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయమై నేను X బృందాన్ని సంప్రదించడానికి చాలా ప్రయత్నించాను. కానీ అక్కడి నుంచి ఆటో రెస్పాన్స్ తప్ప సరైన సమాధానం రాలేదు. నా ఖాతాలోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. కనీసం దాన్ని డిలీట్ చేయలేకపోతున్నాను. దయచేసి ఈ ఖాతా నుండి పంపిన ఏ లింక్‌ పైనా కూడా క్లిక్ చేయవద్దు. అలాగే నా హ్యాక్ అయిన అకౌంట్ లో పోస్ట్ చేసిన దేనినీ నమ్మొద్దు. ఇవన్నీ జనాల్ని మోసం చేయడానికి వాడే లింకులు. అకౌంట్ సెట్ అయ్యాక నేను దాని గురించి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను” అంటూ రాసుకొచ్చింది.


దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రేయా ఘోషల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఫిబ్రవరి 13 న అకౌంటు హ్యాక్ అయితే ఇప్పటిదాకా అభిమానులకు చెప్పకుండా ఏం చేశావు? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

శ్రేయా ఘోషల్ తెలుగు సాంగ్స్ 

కాగా శ్రేయ ఘోషల్ బాలీవుడ్ లో స్టార్ సింగర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘చిక్ని చమేలి’, ‘మేరే ధోల్నా’, ‘తేరి యాదోన్ మే’, ‘జలీమా’, ‘యిమి యిమి’, ‘బార్సో రే’ వంటి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ను పాడింది. శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగులో కూడా సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ఇక తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’ సినిమాలో ‘ప్రేమించే ప్రేమవా’, ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ‘మధురం కదా’, ‘రాధే శ్యామ్’ మూవీలో ‘నిన్నే లే’, ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో ‘నీ నవ్వే’, ‘పుష్ప 2’ మూవీలో ‘సూసేకి’ సాంగ్స్ ని పాడి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది శ్రేయ ఘోషల్.

ఇటీవల శ్రేయా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊబకాయాన్ని అరికట్టడానికి తీసుకున్న చొరవకు సపోర్ట్ చేసి వార్తల్లో నిలిచింది. “మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాంటీ-ఒబెసిటీ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేస్తున్నందున ఇది నేటి తరానికి అవసరం. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరిగ్గా తినాలని, నూనె వాడకాన్ని తగ్గించాలని, చక్కెరను తగ్గించాలని, పోషకాహారం తీసుకోవాలని, టైమ్ కు ఆహారం తీసుకోవాలని, చిన్న పిల్లలకు ఎక్కువ పోషకాహారం ఇవ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం. ఆరోగ్యం మన జీవితంలో అతిపెద్ద సంపద. కాబట్టి ఇంట్లో చిన్న మార్పులు చేసుకుని, మన దేశంలో పెద్ద ప్రభావాన్ని చూపిద్దాం” అంటూ వీడియోను షేర్ చేసింది.

 

View this post on Instagram

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×