Mohammad Rizwan: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 నుండి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. బంగ్లాదేశ్ తో జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకుందామన్న పాకిస్తాన్ జట్టుకి వర్షం ఆటంకం కలిగించడంతో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు, కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ {Mohammad Rizwan} పై అక్కడి మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అయితే కెప్టెన్ రిజ్వాన్ పై తీవ్రంగా మండిపడ్డాడు.
Also Read: Matthew Short Injury: సెమీఫైనల్ కు ముందే ఆసీస్ కు ఎదురుదెబ్బ.. మరో ప్లేయర్ దూరం !
మహమ్మద్ రిజ్వాన్ ఓ అబ్నార్మల్ వ్యక్తి అని విమర్శించాడు. పీటీవీతో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ..” ఆటగాళ్లపై మాకు వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు. ఒకవేళ నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను పాకిస్తాన్ క్రికెట్ గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉండేవాడిని కాదు. నిజాయితీగా చెప్పాలంటే ఈ జట్టుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. 2011 నుండి నేను ఇదే మాట చెబుతున్నాను. 2011 నుండి ఈ పతనం ప్రారంభమైంది. కెప్టెన్ గా అబ్నార్మల్ వ్యక్తులకు అవకాశం ఇస్తే.. మ్యాచ్ ఫలితం ఇలాగే ఉంటుంది.
నేను గతంలో పనిచేసిన కెప్టెన్లను చూస్తే.. కొందరి వ్యక్తిత్వాలు రోజులలో మూడుసార్లు మారేవి” అని విమర్శించాడు. ఇక బంగ్లాదేశ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ {Mohammad Rizwan} మాట్లాడుతూ.. మా ప్రదర్శన పై సాకులు వెతకడం లేదని అన్నాడు. “ఈ టోర్నీలో మా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాం. ఇది మాకు నిరాశను కలిగించింది. మరోవైపు గాయాలు, ఒత్తిడి కారణంగా జట్టు మెరుగ్గా రాణించలేకపోయింది.
ఆస్ట్రేలియాలో బాగా రాణించిన నయీమ్ ఆయుబ్, ఫకర్ జమాన్ గాయపడ్డారు. కానీ జట్టు ఓటములకు దీనిని సాకుగా చెప్పడం లేదు. పాకిస్తాన్ జట్టు బలాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. ఇతర జట్లతో పోటీ పడడానికి మేము ఇంకా నేర్చుకోవాల్సి ఉంది” అని {Mohammad Rizwan} అన్నాడు. ఇక 29 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై ఓ ఐసీసీ టోర్నమెంట్ ఆడిన పాకిస్తాన్ జట్టుపై అక్కడి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి జట్టు మధ్యలోనే నిష్క్రమించడంతో.. ఆ దేశ అభిమానులే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: Attack on Babar Azam: పాక్ లో కలకలం…బాబర్ అజాం ఇంటిపై దాడి…?
ఈ పరిస్థితిని పునరావృతం కాకుండా చూసుకోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జాతీయ జట్టులో పెద్ద పునర్నిర్మానం చేయాల్సి ఉంది. అయితే ఈ ఓటములతో ఇటు మాజీ క్రికెటర్ల నుండి, అటు క్రీడాభిమానుల నుండి తీవ్ర విమర్శలు రావడంతో కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్ బాధ్యతలకు రాజీనామా చేయబోతున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
🚨 BREAKING NEWS 🚨
🚨 MOHAMMED RIZWAN STEPPED DOWN AS PAKISTAN CAPTAIN 🚨 pic.twitter.com/0EcmzGs53c
— mufaddla parody (@mufaddl_parody) February 28, 2025