BigTV English

Shruthi Haasan : విమానయాన సంస్థ పై శృతి హాసన్ గుస్సా… ఏం జరిగిందంటే?

Shruthi Haasan : విమానయాన సంస్థ పై శృతి హాసన్ గుస్సా… ఏం జరిగిందంటే?

Shruthi Haasan : గ్లామర్ డాల్ శృతి హాసన్ ప్రస్తుతం కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘సలార్’ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడింది. అలాగే గత ఏడాది ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘సలార్ 2’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ అయ్యాక శృతి హాసన్ సినిమాల విషయంలో మరింత సెలెక్టివ్ గా మారింది. ఇక తాజాగా ఈ బ్యూటీ విమానయాన సంస్థ ఇండిగో పై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్న ఇండిగో సంస్థపై శృతి హాసన్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటో చూసేద్దాం పదండి.


నాలుగు గంటల నరకం…

తాజాగా ప్రయాణికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంపై శృతి హాసన్ ఫైర్ అయ్యింది. ఫ్లైట్ ఆలస్యంపై స్పందిస్తూ తను సాధారణంగా ఇలాంటి విషయంలో సర్దుకుపోతానని, కానీ ఈసారి ఇండిగో రీ ఎక్కువగా ఇబ్బంది పెట్టిందంటూ వెల్లడించింది. నాలుగు గంటల నుంచి ఎయిర్ పోర్టులో తాము పడిగాపులు కాస్తున్నప్పటికీ ఫ్లైట్ ఇంకా బయలుదేరలేదు అని చెప్పుకొచ్చిన శృతిహాసన్ ఇలాంటి విషయాల్లో క్లారిటీతో పాటు మరింత మెరుగైన రూల్స్ ను పాటిస్తే బెటర్’ అని సలహా ఇచ్చింది. దీంతో వెంటనే సోషల్ మీడియాలో ఇండిగో సంస్థపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.


క్షమాపణలు చెప్పిన విమానాయన సంస్థ…

ఇక శృతి హాసన్ ట్వీట్ చేసిన అతి కొద్ది సమయంలోనే రెస్పాండ్ అయిన ఇండిగో సంస్థ హీరోయిన్ కి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు ఇబ్బంది పడడం గురించి ప్రస్తావిస్తూ విచారం వ్యక్తం చేసిన సదరు సంస్థ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చింది. అందులో ‘మిస్ శృతి హాసన్ మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ఫ్లైట్ ఆలస్యం అనేది ఎంత ఇబ్బందికరమో మేము అర్థం చేసుకోగలం. కానీ ముంబైలో వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఫ్లైట్ ఆలస్యం జరిగింది. ఈ వాతావరణ అంశాలు మా చేతుల్లో లేవని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కస్టమర్లకు ఇబ్బంది రాకుండా ఉండడానికి మేము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము’ అంటూ ఫ్లైట్ ఆలస్యానికి కారణాన్ని వివరిస్తూ రిప్లై ఇచ్చింది. ఇక ఇప్పుడు శృతి హాసన్ మాత్రమే కాదు గతంలో మరో నటి దివ్య దత్త కూడా ఇలాగే ఇండిగో సంస్థ తీరుపై గుస్సా అయ్యింది. ఎలాంటి సమాచారం లేకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారు ? అని ప్రశ్నిస్తూ తన జీవితంలోనే అదొక భయంకరమైన అనుభవం అంటూ వెల్లడించింది. కాగా ప్రస్తుతం శృతిహాసన్ ‘సలార్ 2’, ‘చెన్నై స్టోరీ’, అడవిశేష్ తో కలిసి మరో సినిమా చేస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×