Shruti Haasan:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్b(Shruti Haasan) ‘అనగనగా ఓ ధీరుడు’, ‘ఓ మై ఫ్రెండ్’ అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తర్వాత కోలీవుడ్ లో పలు చిత్రాలు చేసింది. కానీ అక్కడ కూడా మెప్పించలేకపోయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని, ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలా తెలుగులో రవితేజ (Raviteja), మహేష్ బాబు (Maheshbabu), రామ్ చరణ్ (రామ్ charan), ఎన్టీఆర్ (NTR), చిరంజీవి(Chiranjeevi) వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమె అటు కోలీవుడ్ లో కూడా సూర్య (Suriya), విజయ్ దళపతి (Vijay Thalapathi), అజిత్ కుమార్ (Ajith Kumar), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి వారితో కూడా నటించింది. ప్రభాస్ (Prabhas) నటించిన ‘సలార్’ చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
వరుస సినిమాలతో బిజీగా మారిన శృతిహాసన్..
ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. లోకేష్ కనగరాజు(Lokesh Kanagaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ (Kalanidhi maran) ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున(Nagarjuna ), ఉపేంద్ర(Upendra ) సౌబిన్ షాహిర్, సత్యరాజ్ , జూనియర్ మగర్, మోనిష బ్లాసీ, రెబా మోనిక జాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రంతోపాటు శృతిహాసన్.. విజయ్ దళపతి చివరి సినిమా అయిన ‘జననాయగన్’ లో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే ఈమె ఒక ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్..
కానీ ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటో చెప్పలేదు. ప్రస్తుతం శృతిహాసన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అది చూసిన అభిమానులు, నెటిజన్ లు కంగారు పడిపోతున్నారు. ఆమెకు ఏమైందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా శృతిహాసన్ ఇప్పుడు భయంకరమైన వ్యాధితో బాధపడుతోందని తెలియడంతో ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటి..?ఏం జరిగింది? అని తెలుసుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అభిమానులకు కంగారు తీరేలా శృతిహాసన్ ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇక శృతిహాసన్ విషయానికి వస్తే.. సింగర్ గా, హీరోయిన్ గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో ఆ బాధలు ఎన్నింటినో భరించిన ఈమె, ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక పేరు గుర్తింపు సొంతం చేసుకుంది
కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.