IRCTC Himachal Tour Package: దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను టూరిస్టులకు చూపించడంలో IRCTC ఎప్పటికప్పుడు స్పెషల్ ప్యాకేజీలను తీసుకొస్తోంది. బడ్జెట్ ధరలో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తోంది. సమ్మర్ సెలవులు కావడంతో హిమాచల్ ప్రదేశ్ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా ధర్మశాల, డల్హౌసీలో ఎంజాయ్ చేసే ఏర్పాట్లు చేసింది. ఇంతకీ ఈ టూర్ ఎన్నిరోజులు ఉంటుంది? ఖర్చు ఎంత అవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
‘ఎవర్ గ్రీన్ హిమాచల్’ పేరుతో స్పెషల్ ప్యాకేజీ
ఇండియన్ రైల్వే అనుబంధ సంస్థ అయిన IRCTC, ‘ఎవర్ గ్రీన్ హిమాచల్’ పేరుతో ఆకర్షణీయమైన, సరసమైన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో భాగంగా ధర్మశాల, డల్హౌసీలను సందర్శించే అవ్ఆశం కల్పిస్తోంది. డల్హౌసీ 1800లలో బ్రిటిష్ పాలనలో అద్భుతమైన భవంతులను నిర్మించారు. ధర్మశాల దేశంలోనే అందమైన హిల్ స్టేషన్. ఇది అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, బౌద్ధ ఆరామాలు, శక్తివంతమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది.
8 పగళ్లు..7 రాత్రుల టూర్
ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ 8 పగళ్లు, 7 రాత్రులుగా ఉంటుంది. ఈ టూర్ 6 మే న ప్రారంభం అవుతుంది. 12331 నెంబర్ గల రైలు హౌరా రైల్వే స్టేషన్ నుంచి హిమగిరి ఎక్స్ ప్రెస్ 11:55 గంటలకు బయల్దేరుతుంది. ఈ టూర్ కు వెళ్లే ప్రయాణీకులు టూర్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో విలాసవంతమైన హోటల్‌లో బస చేయడానికి అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ ప్యాకేజీలో కేవలం బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందిస్తారు. మిగతా ఫుడ్ ఖర్చులు ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.
‘ఎవర్ గ్రీన్ హిమాచల్’ ప్యాకేజీ ఛార్జ్ ఎంత అంటే?
ఇక ఈ స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి ఛార్జ్ కు సంబంధించిన వివరాలను భారతీయ రైల్వే ప్రకటించింది. సింగిల్ గా వెళ్లే వారికి రూ. 46,250గా ఛార్జ్ ఫిక్స్ చేశారు. డబుల్ షేరింగ్ కోసం ఒక వ్యక్తికి ఛార్జీ రూ. 24, 800గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కోసం రూ. 23, 750గా నిర్ణయించబడింది. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు ఛార్జీ రూ. 12, 350గా నిర్ణయించబడింది IRCTC.
Read Also: వందే భారత్, శతాబ్ది రైళ్లు ప్రభుత్వం నడపడం లేదా? ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయా?
పూర్తి వివరాలు కావాలంటే..
‘ఎవర్ గ్రీన్ హిమాచల్’ ప్రత్యేక టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాల కోసం IRCTC వెబ్ సైట్ ను చూడాలని ఇండియన్ రైల్వే ప్రకటించింది. IRCTC వెబ్ సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా ఈ స్పెషల్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్యాకేజీ కోడ్ EHR127గా ప్రకటించింది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే 8100829002, 8595936690, 7003125135 నంబర్లకు టూరిస్టులు కాస్ చెయ్యొచ్చని అధికారులు తెలిపారు.
Read Also: రైల్వే ట్రాక్స్ పై సోలార్ ప్యానెల్స్, ఐడియా అదిరింది గురూ!