Samantha:ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి దీని ద్వారా చిత్రాలను నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ హౌస్ నుంచీ ‘మా ఇంటి బంగారం’ సినిమా వస్తుందని ప్రకటించినా.. ఇప్పుడు అంతకంటే ముందు ‘శుభం’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోతున్న ఫస్ట్ ఫిలిం శుభం. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. సమంత తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని తెలియజేసింది.
సమంత నిర్మించిన ఫస్ట్ మూవీ..
ప్రముఖ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వసంత్ మారెనగంటి రచించారు. రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇకపోతే చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమా టీజర్ ను మార్చి 30వ తేదీన ఉగాది సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫన్నీగా సాగడమే కాకుండా హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీజర్ తోనే అంచనాలు పెంచేశారు. త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి సమంత ప్రొడక్షన్ బ్యానర్ పై తొలిసారి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
సమంత సినిమాలు..
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి, స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.అలా కెరియర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వివాహమైన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.విడాకులు తీసుకున్న అనంతరం సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పైగా మయోసైటీస్ వ్యాధి బారిన పడి, విదేశాలకు వెళ్లి , అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక తర్వాత వచ్చి యశోద, శాకుంతలం సినిమాలు చేసింది. కానీ స్టార్ స్టేటస్ ను మాత్రం అందించలేకపోయాయి.మళ్లీ విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేసి పరవాలేదు అనిపించుకున్న సమంత.. ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమయింది . మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వచ్చిన సమంత రాజ్ నిడిమూరు దర్శకత్వంలో వచ్చిన “సిటాడెల్ – హనీ బన్నీ” వెబ్ సిరీస్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ఇప్పుడు అదే డైరెక్టర్ దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. కానీ ఈ వెబ్ సిరీస్ పై ఇంకా ఎటువంటి అప్డేట్స్ వదలలేదు.ఇక మరొకవైపు నిర్మాతగా తాను నిర్మించిన చిత్రాలను విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉండగా మరొకవైపు రాజ్ నిడిమోరు తో ప్రేమాయణం నడుపుతోందని, పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌస్ లో వస్తున్న తొలి చిత్రానికి కూడా అతడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తుండడంతో అనుమానాలు మరింత బలమవుతున్నాయి. మరి దీనిపై సమంత ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.
Shiva Rajkumar : చిన్నపిల్లాడి సైకిల్ లాక్కొని… కన్నడ స్టార్ ఆటలు… వీడియో వైరల్..!
May just got Subham-fied. See you at the movies on May 9th!@TralalaPictures #Subham pic.twitter.com/pNGCQdaKOd
— Samantha (@Samanthaprabhu2) April 18, 2025