Athiya Shetty – KLRahul : ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వీరి ఇరువురు ఒక గుడ్ న్యూస్ ను అభిమానులకు షేర్ చేశారు. వీరి కుటుంబంలో ఆనందం తో నిండిపోయింది. వారికి పండంటి పాప పుట్టింది. ఈ విషయాన్ని స్వయంగా కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతియా శెట్టి బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె. కేఎల్ రాహుల్ అతియా శెట్టి, ప్రేమించుకుని ఇరుకుటుంబ పెద్దలను ఒపించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి వివాహం జరిగింది. వీరికి 2025 మార్చి 24న మొదటి సంతానం గా పాప పుట్టింది. ఇప్పుడు ఈ పాపకు పేరు ప్రకటించారు రాహుల్. ఆ పేరేమిటి ఆ పేరుకున్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేవుని బహుమతి..
బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి, రాహుల్ మార్చి 28వ తేదీన పాపని వారింట్లోకి ఆహ్వానిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పంచుకున్నారు. మా జీవితాల్లోకి వచ్చిన మా చిన్నారిని ఆశీర్వదించండి అని రాహుల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుని రీ పోస్ట్ చేస్తూ అతియా తల్లి రెడ్ హార్ట్ ఎమోజి తో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాజాగా వీరు ఆ పాప యొక్క పేరుని ప్రకటించారు. ఆమె పేరు ఎవారా. ఈ పేరుకి అర్థం దేవుని బహుమతి. మా ఇరువురిని ఆశీర్వదించి దేవుడు ఇచ్చిన ఈ బహుమతికి ఎవారా అని పేరు ప్రకటిస్తున్నట్లు రాహుల్ తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ పోస్ట్ కు అభిమానులనుండి సెలబ్రిటీల వరకు శుభాకాంక్షలు అంటూ అందరూ ఆనందాన్ని తెలుపుతున్నారు.
ఐపీఎల్ సీజన్ టైం లో ..
ఇప్పుడు ఐపీఎల్ సీజన్ జరుగుతోంది. ఈ టైంలో రాహుల్ తన కుమార్తె గురించి చెప్పడం, పేరుని ప్రకటించడంతో అభిమానులలో మరింత ఆనందాన్ని పెంచారని చెప్పొచ్చు. అతియా తండ్రి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన మనవరాలు రాకతో, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాతగా మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సునీల్ శెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబాల్లో వచ్చిన ఈ కొత్త బంధంతో, కొత్త జీవితాన్ని మొదలుపెట్టనున్నారు. ఏది ఏమైనా ఈ పోస్ట్ అటు క్రికెట్ ఫ్యాన్స్ లోను ఇటు బాలీవుడ్ లోను సంతోషాన్ని అందించింది.
Aditi Rao Hydari : నా వంట మనిషి… అయ్యో కట్టుకున్న భర్తను అంత మాట అనేసిందేంటి భయ్యా.. .