BigTV English

Actress : నాకు 3 పెళ్లిళ్లు.. నా కూతురికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్… ప్రముఖ నటి షాకింగ్ స్టేట్మెంట్

Actress : నాకు 3 పెళ్లిళ్లు.. నా కూతురికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్… ప్రముఖ నటి షాకింగ్ స్టేట్మెంట్

Actress : నటీనటుల పర్సనల్ విషయాలు, ముఖ్యంగా డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే స్టార్ కిడ్స్ పై ఈ విషయాలలో జనాల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ రూమర్లు హద్దు దాటితే, సెలబ్రిటీలు ఘాటుగా స్పందిస్తారు. తాజాగా ఓ ప్రముఖ నటి ‘నాకు 3 పెళ్లిళ్లు.. నా కూతురికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్’ అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.


బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan), ప్రముఖ నటి శ్వేతా తివారీ (Shweta Tiwari ) కూతురు పాలక్ తివారీ (Palak Tiwari) తో డేటింగ్‌లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి రెస్టారెంట్ లకు వెళ్ళడం, కలిసి కన్పించడంతో ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి. అంతేకాదు ఈ జంట కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు అనే ఊహాగానాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా పాలక్ తల్లి, శ్వేతా తివారీ ఇప్పుడు ఇబ్రహీంతో తన కూతురు డేటింగ్ పుకార్లపై స్పందించింది. ఈ మేరకు ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో శ్వేతా మాట్లాడుతూ “ఇకపై రూమర్‌లు నన్ను ఇబ్బంది పెట్టవు. ఇన్నేళ్లలో నేను ప్రజల జ్ఞాపకశక్తి 4 గంటలు మాత్రమే ఉంటుందని గ్రహించాను. ఆ తర్వాత వాళ్ళు వార్తలను మరచిపోతారు. కాబట్టి ఇలాంటి రూమర్ల గురించి ఎందుకు బాధపడాలి? పుకార్ల ప్రకారం నా కుమార్తె ప్రతి మూడవ వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. నేను ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుంటాను. నేను ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకున్నాను. నా కూతురుకేమో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ విషయాలు నాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేవు” అంటూ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది.


శ్వేతా ఇంకా మాట్లాడుతూ “కొన్నిసార్లు నేను భయపడతాను. నా కుమార్తె ఇలాంటి విషయాల గురించి పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడదు. ఈ ట్రోలింగ్ యుగం చాలా ఘోరంగా ఉంది. ఆమె స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఆమెపై ఈ రూమర్ల వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందో, ఆమె ఆత్మవిశ్వాసం ఏమవుతుందోనని భయపడతాను” అని శ్వేత అన్నారు. కొంతకాలం క్రితం పాలక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ మధ్య బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఏమీ లేదని చెప్పింది.

ఇదిలా ఉండగా నటి శ్వేతా తివారీ ఒక ప్రముఖ హిందీ టెలివిజన్‌ నటి. ఆమెకు హీరోయిన్లకు ఉన్న రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక శ్వేత అడుగుజాడల్లోనే ఆమె కుమార్తె పాలక్ తివారీ కూడా నడుస్తోంది. ఇప్పటికే పాలక్ నటిగా రంగప్రవేశం చేసింది. కానీ పాలక్ సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్లతో, సోషల్ మీడియాలో ట్రోల్ తో వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ త్వరలో ‘సర్జమీన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఖుషీ కపూర్‌, కాజోల్‌తో కలిసి ఇబ్రహీం మరో సినిమా కూడా చేస్తున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×