Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులు ఈజీగా జర్నీ చేసేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. టికెట్ బుకింగ్ మొదలు కొని.. రైల్లో కల్పించే సదుపాయాల వరకు ఎప్పటిక కీలక అప్ డేట్స్ చేస్తున్నది. కొత్త సంవత్సరంలో రైలు ప్రయాణం చేయాలనుకునే వారు, IRCTC తాజా రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీటిపై అవగాహన ఉండటం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇంతకీ ప్రయాణీకులు గుర్తించుకోవాల్సిన కీలక అంశాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ తగ్గింపు
రైలు ప్రయాణం చేయాలనుకునే ప్యాసెంజర్లు గతంలో 120 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ డ్ టికెట్స్ బుకింగ్ చేసుకునే వాళ్లు. కానీ, రీసెంట్ గా ఆ నిబంధనను రైల్వే సంస్థ మార్చింది. ఇప్పుడు 60 రోజుల ముందు నుంచే రైలు టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. నవంబర్ 1 నుంచి ఈ నూతన నింబంధన అమల్లోకి వచ్చింది. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న చాలా టికెట్లు ప్రయాణ సమయానికి క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. అవసరం ఉన్న ప్రయాణీకులు ఈ టికెట్లు బుక్ చేసుకునేలా నింబంధనలను మార్చింది.
⦿ టికెట్ క్యాన్సిలేషన్స్
60 రోజుల ముందు నుంచి రైల్వే టికెట్ బుకింగ్ నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ, టికెట్ల క్యాన్సిలేషన్ అనేది పాత పద్దతి ప్రకారమే కొనసాగుతున్నది. ప్రయాణ సమయానికి కొద్ది గంటల ముందుకు వరకు టికెట్లు క్యాన్సిల్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది రైల్వే సంస్థ.
⦿ మినహాయింపులు
60 రోజుల ముందస్తు టికెట్ బుకింగ్ నిబంధనకు సంబంధించి కొన్ని రైళ్లకు మినహాయింపు ఇచ్చింది రైల్వే సంస్థ. తక్కువ బుకింగ్ విండోలను కలిగి ఉన్న తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ లాంటి ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఈ మార్పు నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. టు విదేశీ పర్యాటకులు ఎప్పటి లాగే 365-రోజుల ముందు టికెట్ రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కొనసాగిస్తున్నది.
⦿ IRCTCలో నూతన టెక్నాలజీ వినియోగం
ఇక భారతీయ రైల్వే సంస్థకు సంబంధించిన అధికారిక టికెట్ బుకింగ్ సైట్ IRCTCలో సీట్ల కేటాయింపుకు సంబంధించి కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకుల డేటాను విశ్లేషించనున్నారు. రిజర్వేషన్ చార్ట్ లను రూపొందించిన తర్వాత అందుబాటులో ఉన్న సీట్లను AI అంచనా వేస్తుంది. ఈ విధానం ద్వారా వెయిట్ లిస్ట్ ప్రయాణీకులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.
Read Also: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, విజయవాడ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
భారతీయ రైల్వే సంస్థ తాజాగా మార్పులు, చేర్పులు ప్రయాణీకుల మెరుగైన ప్రయాణాన్ని, ప్రణాళికలను మరింత సులభతరం చేయనున్నాయి. 2025లో రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉపయోగపడనున్నాయి. రైల్వే ప్రయాణీకులు ఎప్పటికప్పుడు నూతన నియమ నిబంధనలను తెలుసుకునేందుకు తరచుగా ఇండియన్ రైల్వే, IRCTC వెబ్ సైట్ ను చూస్తూ ఉండాలి.
Read Also: రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?