BigTV English

Siddharth – Aditi Rao Hydari Marriage Date: సిద్ధార్థ్ – అదితి పెళ్లి మూహూర్తం ఫిక్స్.. ఏ నెలలో అంటే..?

Siddharth – Aditi Rao Hydari Marriage Date: సిద్ధార్థ్ – అదితి పెళ్లి మూహూర్తం ఫిక్స్.. ఏ నెలలో అంటే..?

Aditi Rao Hydari Siddharth Marriage Date Fixed: నటుడు సిద్ధార్థ్ – నటి అదితి రావు హైదరి గత కొన్నేళ్లుగా డీప్ లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మహా సముద్రం సినిమా ద్వారా వీరిద్దరు స్నేహితులుగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో సిద్, అదితి జంటగా నటించారు. అయితే సినిమా బెడిసి కొట్టినా.. వీళ్లిందరికి మాత్రం కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే ఈ మూవీ తర్వాత స్నేహితులుగా ఉన్న ఈ జంట ప్రేమికులుగా మారిపోయారు.


ఇక అప్పట్నుంచి ముంబైలో చెట్టా పట్టాలేసుకుంటూ ఎంజాయ్ చేశారు. రెస్టారెంట్స్, హోటల్స్, మ్యారేజెస్, పార్టీలకు హాజరయ్యేవారు. ఆ మధ్య తరచూ వీరి గురించే చర్చ. అయినా ఈ జంట మాత్రం ఎప్పుడూ నోరు మెదపలేదు. వీరి డేటింగ్‌పై ఎన్నో కథనాలు, ఎన్నెన్నో కథలు జోరుగా సాగాయి. అయినా వీరు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఒకవేళ స్పందించాల్సి వచ్చినా.. తాము స్నేహితులం అనే చెప్పుకునే వారు.

అలాగే వీరి గురించి తరచూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ సడెన్‌గా వీరిద్దరూ ఆ రూమర్స్‌ను నిజం చేశారు. ఇటీవలే ఆ వార్తలను నిజం చేస్తూ.. ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు అంతా షాక్ అయ్యారు. తమ మధ్య ఏదీ లేదని చెబుతూనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారంటూ కామెంట్ల వర్షం కురిపించారు.


Also Read: అదితితో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌.. తొలిసారి స్పందించిన సిద్ధార్థ్‌

అయితే సిద్ధార్థ్, అదితి నిశ్చితార్థం అయిపోయింది.. మరి మ్యారేజ్ ఎప్పుడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చింది. త్వరలోనే ఈ లవ్ కపుల్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో సిద్ధార్థ్ – అదితిలు పెళ్లి పీటలెక్కే అవకాశం ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అంటే మరో ఐదు నెలల్లో వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నరు అన్న మాట.

అయితే త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ జంట జాలీగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఇటలీలో ఈ ప్రేమ జంట విహరిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వెంటనే వైరల్‌గా మారిపోయాయి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×