BigTV English

Oy Re Release Tickets Booking : ఓయ్ ఫ్యాన్సూ… వినిపిస్తుందా…. టికెట్లు ఇచ్చే డేట్ వచ్చేసింది

Oy Re Release Tickets Booking : ఓయ్ ఫ్యాన్సూ… వినిపిస్తుందా…. టికెట్లు ఇచ్చే డేట్ వచ్చేసింది

Oy Re Release Tickets Booking : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఎప్పటికీ కొన్ని సినిమాలు ముందుంటాయి. అటువంటి కొన్ని సినిమాలలో ఓయ్ అనే సినిమా కూడా ఒకటి. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమాలో అన్ని అంశాలు కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రస్తుత కాలంలో సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రేక్షకులు మైండ్ సెట్ మారింది కాబట్టి ఎప్పుడో ప్లాప్ చేసిన సినిమాలు కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఆరెంజ్ సినిమా అని చెప్పొచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరంజ్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాత నాగబాబు, మా మెగా బ్రదర్స్ ఇద్దరు లేకపోయి ఉంటే దాదాపు సూసైడ్ చేసుకొని పరిస్థితి వెళ్లిపోయేవారని అప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.

రీ రిలీజ్ అయిన ఓయ్ సినిమాకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓయ్ సినిమా విషయానికి వస్తే సినిమాలో చాలా అద్భుతమైన విషయాలను పొందుపరిచాడు దర్శకుడు. ఈ సినిమాలో సిద్ధార్థ క్యారెక్టర్ పేరు ఉదయ్ అని పెట్టాడు. అలానే హీరోయిన్ పేరు సంధ్య అని పెట్టాడు. ఇకపోతే ఉదయానికి ఆపోజిట్ సాయంత్రం కాబట్టి హీరోయిన్ కి సంధ్య అని పేరుని పెట్టాడు. ఇకపోతే ఈ సినిమా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో మొదలవుతుంది. ఆ తర్వాత న్యూ ఇయర్ కి ఈ లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది. సరిగ్గా ఉదయ్ సంధ్య మధ్య లవ్ స్టోరీ కరెక్ట్ గా వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ సినిమాకి వన్ లోని ఇయర్లోనే వై తీసుకొచ్చి ఓయ్ అనే టైటిల్ ని పెట్టాడు.


ఈ క్లాసిక్ లవ్ స్టోరీ మళ్ళీ ఒకసారి రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా టికెట్స్ రేపటి నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం సెకండ్ టైం రీ రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమాకు రెస్పాన్స్ విపరీతంగా వస్తుంది. బహుశా దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఓయ్ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఊహించి ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు మరోసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక తెలుగు సినిమా బానిసలు ఈ సినిమా కూడా బ్రేక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: Dabidi Dibidi Song: బాలయ్య మాస్ రేంజ్ ఇది.. ఇక్కడ కొడితే.. జపాన్‌లో రీసౌండ్

Tags

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×