Siddu Jonnalagadda : ఏంటి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డిప్రెషన్‌లోకి వెళ్లాడా అని అంటే… అవును అనే సమాధానం వస్తుంది ఇండస్ట్రీ నుంచి. డిజే టిల్లు ఫ్రాంచైజీతో ఫేమస్ అవ్వడమే కాదు… టిల్లు స్క్వేర్ మూవీతో 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయాడు. దీనికి ముందు వచ్చిన డిజే టిల్లు కూడా పెద్ద హిట్టే. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఆ మూవీ ఏకంగా 33 కోట్లు వసూళ్లు చేసింది.
హీరోగా యాక్ట్ చేయడమే కాదు… రైటింగ్, డైలాగ్స్, డైరెక్షన్ ఇలా… సిద్దు దగ్గర ఉన్న మల్టీ టాలెంట్ వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ఇలాంటి మల్టీ టాలెంట్ హీరో ఇప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ హీరో అయిన సిద్దు.. చేసిన డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల వల్ల నిజంగానే స్టార్ బాయ్ అయిపోయాడు. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత స్టార్ బాయ్ సిద్దు చేసే సినిమాలపై మినిమం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఆ.. ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోవడంలో ఇటీవల వచ్చిన జాక్ మూవీ ఫెయిల్ అయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు సిద్దు… ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఈ సినిమా కూడా డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల్లా హిట్ అవుతుందని, తాను హ్యాట్రిక్ హీరో అవుతాను అని చాలా గట్టిగా చెప్పాడు. నిజానికి సినిమాపై అలాంటి అంచనాలు పెట్టుకున్నాడు స్టార్ బాయ్.
కానీ, ఈ సినిమాకు ఆడియన్స్ అస్సలు కనెక్ట్ అవ్వులేదు. సిద్దు అంటే ఎక్స్‌పెక్ట్ చేసే కామెడీ కానీ, లవ్ స్టోరీ కానీ సినిమాలో ఏ మాత్రం పండలేదు. స్పై జానర్, టెర్రరిస్ట్ లు అంటూ కొత్తగా పెట్టినా… ఏమాటకు ఆ మాట చెప్పాలంటే… అవేవీ కూడా మన స్టార్ బాయ్ కి సెట్ అయ్యేవి కావు. ట్రైలర్ వచ్చాకా అలాంటి మాటలు వచ్చినా… సినిమా తర్వాత అదే ప్రూవ్ అయింది.
ఏది ఏమైనా… ఇప్పుడు సినిమా ప్లాప్ అయింది. హ్యాట్రిక్ హీరో అంటూ ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్టార్ బాయ్ ఇప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. గత కొన్ని రోజుల నుంచి ఎవరినీ కలవడం లేదట. ఎప్పుడూ అందరితో కలిసిపోయి… నాలుగు పంచ్ డైలాగ్స్, కామెడీ వేసుకుంటూ ఉండే సిద్దు ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా.. జాక్ ఫెయిల్యూర్ గురించే ఆలోచిస్తున్నడటని టాక్ వినిపిస్తుంది.
దీని తర్వాత తెలుసు కదా అనే మూవీ కూడా చేస్తున్నాడు సిద్దు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కి కూడా సిద్దు వెళ్లడం లేదని, అసలు ఇంటి నుంచే బయటికి రావడం లేదని వినిపిస్తుంది.
ఇలాంటి టైంలోనే ఈ సినిమాకు సిద్దు తీసుకున్న రెమ్యునరేషన్ పై కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నడట సిద్దు. రెండు సినిమాలకే ఇలాంటి రెమ్యునరేషన్ ఎంటి అంటూ టాక్ వచ్చింది. అప్పుడు ఆయన సపొర్టర్స్ హీరో అన్న తర్వాత ఎదగాలి కదా… అందుకే ఈ రెమ్యునరేషన్ అంటూ చెప్పుకచ్చారు.
నిజానికి టిల్లు స్క్వేర్ కి ముందు సిద్దు రెమ్యునరేషన్ కేవలం 5 కోట్లే. టిల్లు స్క్వేర్ నుంచి భారీగా పెంచేసి 12 కోట్లు వసూళ్లు చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ అంటే సీక్వెల్ కాబట్టి.. హిట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 12 కోట్లు తీసుకున్నాడు. కానీ, జాక్ కు అలాంటి పరిస్థితి లేదు. సీక్వెల్ కాదు. పైగా సిద్దుకు ఇదో ప్రయోగం. ఎప్పుడు చేయని జానర్ ను పట్టుకున్నాడు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాకు కూడా టిల్లు స్క్వేర్ కు తీసుకున్న పారితోషికమే తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి.