BigTV English

Jack : సెన్సార్‌‌ అయిందా? నాకు తెలీదు… బూ*తులపై హీరో ఫ్రస్టేటెడ్ రియాక్షన్

Jack : సెన్సార్‌‌ అయిందా? నాకు తెలీదు… బూ*తులపై హీరో ఫ్రస్టేటెడ్ రియాక్షన్

Jack : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను రూపొందించారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ‘జాక్’ అనే ఒక ప్రైవేట్ స్పై ఏజెంట్ గా సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినిమాలో బూ*తులు, డైరెక్షన్లో వేలు పెట్టడం వంటి అంశాలపై సిద్దు జొన్నలగడ్డ స్పందించారు.


‘జాక్’లో బూ*తులు, సెన్సార్ సంగతేంటి ?

‘జాక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మీడియాతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నారు ‘జాక్’ టీమ్. అందులో భాగంగా “సినిమాలో బూ*తులను బాగానే వాడినట్టున్నారు?” అనే ప్రశ్నకి సిద్దు జొన్నలగడ్డ అవునని సమాధానం చెప్పాడు. “ఎందుకలా వాడారు? జనాలు అలాంటివి యాక్సెప్ట్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు?” అనే ప్రశ్నకి… “నేను స్పెషల్ గా ఏమి ప్లాన్ చేయలేదు. హీరో క్యారెక్టర్ కి, ఆ సీన్ లో హీరో ఎమోషన్ కి, పీక్ క్లైమాక్స్ లో వచ్చే ఫ్రస్టేషన్ లో నుంచి వస్తుంది అది. అక్కడ ఆ క్యారెక్టర్ కి ఆ ఎమోషన్ కరెక్ట్ అనిపించింది కాబట్టి పెట్టాను” అని అన్నారు.


“మరి మూవీ సెన్సార్ జరిగిందా?” అనే ప్రశ్నకి తెలియదని సమాధానం చెప్పారు. “హీరో అయినప్పటికీ సెన్సార్ జరిగిందో లేదో తెలియకుండా ఎలా ఉంటుంది ?” అని అడగ్గా… “నేను సెన్సార్ ఆఫీస్ కి వెళ్లలేదు. కాబట్టి తెలియదు ” అని అన్నారు.

దర్శకత్వంలో సిద్ధూ వేలు పెడతాడా?

“బొమ్మరిల్లు భాస్కర్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ ట్రైలర్ లో అడ*ల్ట్రీ డైలాగ్స్ ఎందుకు ఉన్నాయి?” అనే ప్రశ్నకు డైరెక్టర్ స్పందిస్తూ “సినిమాలో ఒకటి లేదా రెండు డైలాగులు ఉన్నాయి అంతే. ఇది బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అని నమ్మి వచ్చే ప్రేక్షకులను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయను” అంటూ క్లారిటీ ఇచ్చారు.

“డైరెక్షన్లో సిద్ధూ వేలు పెడతారా? ఇప్పటిదాకా సిద్ధూ కలిసి వర్క్ చేసిన చాలామంది దర్శకులు కొత్తవారే. కానీ మీరు మాత్రం సీనియర్. ఆయన మల్టీ టాలెంటెడ్. కాబట్టి సినిమాల మధ్యలో కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కి, దానికి క్లాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా?” అనే ప్రశ్న బొమ్మరిల్లు భాస్కర్ కి ఎదురైంది.

దానిపై డైరెక్టర్ స్పందిస్తూ “అదేమీ ఉండదు. డిస్కషన్ రూమ్ వార్ లా ఉంటుంది. మల్టీ టాలెంట్ ఉన్న హీరో సినిమాకు అడిషనల్ ప్లస్ పాయింట్. క్రియేటివ్ క్లాషెస్ ఖచ్చితంగా వస్తాయి. కానీ రిజల్ట్ వచ్చిందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్” అని అన్నారు. డైరెక్టర్ కి చెప్పకుండా షూటింగ్ చేశారంటూ వచ్చిన వార్తలపై సిద్దు మాట్లాడుతూ “ఆయన చెప్తేనే డ్యాన్స్ మాస్టర్ తో కలిసి సెట్ కి వెళ్లాను. డైరెక్టర్ కు తెలియకుండా షూటింగ్ ఎలా చేస్తాం?”  అంటూ క్లారిటీ ఇచ్చారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×