BigTV English

Nara Lokesh : రాబోయే రోజుల్లో.. పాస్టర్ ప్రవీణ్ కేసులో లోకేశ్ రియాక్షన్

Nara Lokesh : రాబోయే రోజుల్లో.. పాస్టర్ ప్రవీణ్ కేసులో లోకేశ్ రియాక్షన్

Nara Lokesh : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు. వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. చంపేశారు.. చంపేశారు.. అంటూ ఒకటే గొడవ. రెడ్ కారు, బెదిరింపు ఫోన్లు అంటూ పక్కదారి పట్టించారు. అదిగో బుల్లెట్ బండి హెడ్ లైట్ పగిలింది.. అంటే ఎవరో గుద్దేసి వెళ్లిపోయారని కొందరు. సీసీఫుటేజ్‌లో ఆ ఐదు కార్లు స్పీడ్‌గా వెళ్లాయి.. అంటే వారే చంపేశారు. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనన్ని సొంత ఇన్వెస్టిగేషన్లు. పైపైన చూస్తే ఇవన్నీ ఎవరికి వారే పెట్టిన పోస్టులు, ఫోటోలు, కామెంట్లు, వీడియోలుగా కనిపిస్తున్నా.. ఇదంతా పక్కాగా జరిగిన ఆర్గనైస్డ్ ఫేక్ పబ్లిసిటీ అనే అనుమానాలు ఉన్నాయి. ఓ పార్టీ వాళ్లే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ప్రజలను పక్కదారి పట్టించారని టీడీపీ అంటోంది. సమాజంలో మత విధ్వేషాలు రగిల్చాలని ఆ వర్గం పక్కా ప్లాన్డ్‌గా ఫేక్ ప్రచారం చేసిందని చెబుతున్నారు. ఇదే అంశంపై తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం స్పందించారు.


లోకేశ్ ఏమన్నారంటే…

రాజకీయ లబ్ది కోసం కావాలనే కులాలు, మతాల మధ్య వైసీపీ గొడవలు సృష్టిస్తోందని మండిపడ్డారు నారా లోకేశ్. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు ఇంకా చేస్తారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదని హెచ్చరించారు.


గతంలో వివేకా కేసు.. ఇప్పుడు ప్రవీణ్ కేసు..

గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ఇలానే డైవర్ట్ పాలిటిక్స్ చేశారని గుర్తు చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. వివేకాను గొడ్డలితో నరికి చంపితే.. రక్తపు మడుగులో పడుంటే.. గుండెపోటు అని డ్రామాలు చేసిన రక్తచరిత్ర ఆ పార్టీదని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులోనూ జరిగింది ఒకటైతే.. చంపేశారంటూ మతాల మధ్య చిచ్చు రగిల్చే కుట్ర చేశారని మండిపడుతున్నారు.

పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఇంత రాజకీయమా?

హైదరాబాద్ నుంచి విజయవాడ చేరే సరికే పాస్టర్ ప్రవీణ్ హెల్త్ కండీషన్ అస్సలు బాలేదు. బాగా నీరసించి పోయారు. అప్పటికే అతని బైక్ రెండు సార్లు ప్రమాదానికి గురైంది. అప్పుడే హెడ్ లైట్ పగిలింది. బెజవాడ పోలీసులు జర్నీ వద్దు.. రెస్ట్ తీసుకోమని వారించినా వినకుండా.. బుల్లెట్ మీద రాజమండ్రి బయలుదేరాడు ప్రవీణ్. మధ్యలో ఓ వైన్ షాపులో లిక్కర్ కూడా కొన్నాడు. అతను బండి కూడా సరిగ్గా కంట్రోల్ చేసే పరిస్థితిలో లేడని పెట్రోల్ పంపు సీసీఫుటేజ్‌లో స్పష్టం అవుతోంది. ఇలా వరుసబెట్టి వందలాది సీసీకెమెరాల ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది.. లేదంటే ప్రవీణ్ పగడాలది హత్యేనని జనాలపై రుద్దేసేవారేగా? ఇదంతా కుట్రపూరితంగా వైసీపీ వర్గాలు చేసిన ప్రచారమనేది టీడీపీ భావన. ఇప్పటితో అయిపోలేదని.. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు ఇంకా చేస్తారని లోకేశ్ అనడం సబబుగానే ఉంది.

వాళ్లను వదిలేదేలే.. నారా లోకేశ్ వార్నింగ్

రెడ్‌బుక్‌లో ఉన్న వాళ్లు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా నారా లోకేశ్ తేల్చిచెప్పారు. పవనన్నకు Z సెక్యూరిటీ మాత్రమే ఉంటే.. జగన్‌కు మాత్రం Z+ సెక్యూరిటీ ఉందని.. అయినా పరదాలు కట్టుకుని తిరుగుతున్నారని అన్నారు లోకేశ్.

Also Read : జగన్‌కు ‘జడ’ గండం? ఆ మహిళ ఎవరంటే..?

వైసీపీలో రెడ్‌బుక్ హడల్

రెడ్‌బుక్. ఈ పేరే వైసీపీ నేతలను హడలెత్తిస్తోంది. బోరుగడ్డ అనిల్ నుంచి పోసాని, వల్లభనేని వంశీ వరకు.. ఇప్పటికే పలువురు జైల్లో ఊచలు లెక్కబెట్టారు. నెక్ట్స్ కొడాలి నానినే అంటుండగా.. ఆయన గుండెనొప్పి అంటూ హాస్పిటల్‌ పాలయ్యారు. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మైనింగ్, లిక్కర్ బిజినెస్‌లపై దాడులు జరుగుతున్నాయి. ఆయన చేయి విరిగితే కట్టుకట్టించుకున్నారు. ఇక.. పేర్ని నాని, అంబటి రాంబాబులు లిస్టులో ముందున్నారు. ఇప్పటికే రేషన్ బియ్యం గోల్‌మాల్ కేసు పేర్ని మెడకు చుట్టుకుంది. ఆయన భార్య ప్రస్తుతం బెయిల్ మీదున్నారు. రేపే మాపో పేర్ని నాని వంతు రావొచ్చు. అంబటి రాంబాబుపై బలమైన కేసులు మోపేలా ఆధారాలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇలా.. నారా లోకేశ్ దూకుడు తట్టుకోలేకే.. పాస్టర్ ప్రవీణ్ కేసులో కుట్ర చేసి.. కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో అబాసుపాలు చేయాలనేది వైసీపీ ఎత్తుగడ అని టీడీపీ భావిస్తోంది.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×