BigTV English
Advertisement

Prakash Raj : పవన్ కళ్యాణ్‌‌కు విజన్ లేదు… డిప్యూటీ సీఎంగా ఆయనను చూడలేం..

Prakash Raj : పవన్ కళ్యాణ్‌‌కు విజన్ లేదు… డిప్యూటీ సీఎంగా ఆయనను చూడలేం..

Prakash Raj : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి పాత్రలోనైనా అద్భుతంగా ఒదిగిపోయే సామర్థ్యం ఉంది ప్రకాష్ రాజ్ కు. ఎన్నో సినిమాలను కేవలం తన నటనతోనే నిలబెట్టాడు. అలానే ఏ భాషలో సినిమా చేసిన ఆ భాష నేర్చుకొని స్వయంగా డబ్బింగ్ చెప్పడం కూడా ప్రకాష్ రాజ్ లోని బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇక ప్రకాష్ రాజ్ కేవలం నటుడు గానే కాకుండా రచయితగా దర్శకుడుగా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన మా ఊరి రామాయణం వంటి సినిమా మంచి ప్రశంసలను పొందుకుంది. తెలుగు సాహిత్యం మీద కూడా ప్రకాష్ రాజ్ మంచి అవగాహన ఉంది. కేవలం నటించడం మాత్రమే కాకుండా అద్భుతమైన పోయెట్రీ కూడా రాస్తూ ఉంటారు.


కాంట్రవర్సీ కు కేరాఫ్ అడ్రస్

చాలామంది యంగ్ దర్శకులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి దర్శకులకి ఇంత పేరు రావడానికి కారణం ప్రకాష్ రాజ్ అని చెప్పాలి. ఒక సీన్ ని ఇంతకంటే బలంగా రాయొచ్చు అని నిత్యం దర్శకులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అలానే తెలుగు దర్శకుడు కృష్ణవంశీతో మంచి పరిచయం కూడా ఉంది. పూరి జగన్నాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి స్టార్ దర్శకులతో మంచి పరిచయం ఉంది. ప్రకాష్ రాజ్ కి ఒక నటుడుగా ఎంత పేరు ఉందో అలానే చాలా కాంట్రవర్సీలు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు సినిమా టైంలో చాలా ఓపెన్ గా శ్రీనువైట్ల పైన కామెంట్ చేశాడు. అలానే శ్రీను వైట్ల కూడా ప్రకాష్ రాజ్ మీద కామెంట్స్ చేశాడు. ఇక ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఇప్పటికీ చాలా ట్వీట్లు చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్.


ఇది సినిమా కాదు

ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. బద్రి వంటి సినిమాలో వీళ్ళ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా హీరో విలన్స్ లా ప్రవర్తిస్తుంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ సభలు కూడా పెడుతున్న సంగతి తెలిసిందే. దానిపైన ప్రకాష్ రాజ్ స్పందించారు. స్పందించడం మాత్రమే కాకుండా ఉదయనిది స్టాలిన్ లాంటి డిప్యూటీ సీఎంతో పోల్చి పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు అసలు విజన్ లేదు. ఇది సినిమా కాదు ఉన్నఫలంగా కాస్ట్యూమ్ మార్చేసి సనాతన ధర్మం అని చెప్పడానికి. చాలామందికి యువతకి ఉద్యోగాలు లేవు, కరప్షన్ ఎక్కువైపోయింది వీటి గురించి మాట్లాడటం మానేశారు. ఆయన్ని డిప్యూటీ సీఎం గా చూడడం నేను చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్.

Also Read : Mad Square Collections : వరల్డ్ వైడ్ వసూళ్ల సునామీ.. 100 కోట్ల క్లబ్ లోకి కామెడీ మూవీ…

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×