Salads For Summer: సలాడ్ మంచి ఆరోగ్యానికి నిధి. మీరు ప్రతిరోజూ సలాడ్ తింటే.. ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు. సలాడ్ లలో వాడే ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సలాడ్ తినడం వల్ల ఎండాకాలంలో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అంతే కాకుండా వీటిలో వాడే కొన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. మరి సమ్మర్ లో తప్పకుండా తినాల్సిన సలాడ్స్ ఏంటి ? వీటిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మిక్స్‌డ్ సలాడ్:
ప్రోటీన్ అధికంగా ఉండే మొలకలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా మీరు శాఖాహారులైతే.. మీ ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రతిరోజూ ఈ సలాడ్ తినాలి.
కావలసినవి: మొలకెత్తిన పెసరపప్పు 1 కప్పు, వేయించిన వేరుశనగలు 2 టేబుల్ స్పూన్లు, కట్ చేసిన టమాటో ½ కప్పు ,కట్ చేసిన దోసకాయ ½ కప్పు,కట్ చేసిన క్యారెట్ ½ కప్పు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1, స్ప్రింగ్ ఆనియన్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి ½ టీస్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: పెసరపప్పును 24 గంటలు నానబెట్టండి. మొలకలను తయారు చేసిన తర్వాత సలాడ్ కోసం వాడండి. తర్వాత వీటిని వేడి నీటిలో రెండు నిమిషాలు నానబెట్టండి. అనంతరం ఒక గిన్నెలో పెసరపప్పు తీసుకుని, జీలకర్ర పొడి, ఉప్పు వేసి అన్నీ బాగా కలపాలి. తర్వాత దోసకాయ, టమాటో, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి కలపండి. కాల్చిన వేరుశనగ గింజలు యాడ్ చేసిన తర్వాత ఈ మూంగ్ స్ప్రౌట్స్ సలాడ్‌ను సర్వ్ చేయండి
2. ఆపిల్ దోసకాయ సలాడ్:
ఆపిల్ , దోసకాయతో తయారు చేసే ఈ సలాడ్ చాలా తక్కువ పదార్థాలతో త్వరగా తయారు చేసుకోవచ్చు.సమయం తక్కువ ఉన్నప్పుడు తొందరగా దీన్ని తయారు చేసుకోవచ్చు.
కావలసినవి: ఆపిల్ 1, దోసకాయ 1, పుదీనా 3 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, పొడి చేసిన నల్ల మిరియాలు ½ స్పూన్, తేనె 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్.
తయారీ విధానం: ఒక గిన్నెలో ఆపిల్ , దోసకాయలను చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత వాటిలో తేనె, నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. దానికి పుదీనా ఆకులు వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.
3. రెయిన్బో ఫ్రూట్ సలాడ్:
పేరులాగానే ఈ సలాడ్ వివిధ రంగుల పండ్లతో తయారు చేసుకోవచ్చు. ఇది చూసిన తర్వాత తినకుండా ఎవ్వరు ఉండలేరంటే నమ్మండి.
కావలసినవి: అరటిపండు 2, దానిమ్మ 1, జామ 1, ప్లం 1, ఆపిల్ 1, స్ట్రాబెర్రీ 7-8, కివి 3, పైనాపిల్ 5 ముక్కలు, స్ట్రాబెర్రీ/వనిల్లా పెరుగు ½ కప్పు, తాజా క్రీమ్ ½ కప్పు.
Also Read: సమ్మర్‌లో.. కూల్ కూల్‌గా ఐస్ ఫేషియల్
తయారుచేసే విధానం: ముందుగా అన్ని పండ్లను బాగా శుభ్రం చేయాలి. ఆపిల్ తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి. రేగు పండ్లను చిన్న ముక్కలుగా కోయండి. దానిమ్మ గింజలు తీసివేసి, అరటిపండును గుండ్రని ముక్కలుగా కోయండి. పైనాపిల్‌ను ముక్కలుగా చేసుకోండి. కివీని కూడా గుండ్రని ముక్కలుగా కోయండి. ఒక పెద్ద గిన్నెలోకి తరిగిన పండ్లన్నింటినీ తీసుకోండి. తర్వాత వాటిని బాగా కలపండి. దానికి పెరుగు, క్రీమ్ వేసి మరోసారి బాగా మిక్స్ చేయండి. అంతే మీ రెయిన్బో ఫ్రూట్ సలాడ్ తినడానికి సిద్ధంగా ఉంది.