Ss Thaman : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్ సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు. మొదట కిక్ పాటలు విన్న వెంటనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపడిపోయింది. ఎవరి కొత్త కుర్రాడు ఇంత బాగా సాంగ్స్ ని కంపోజ్ చేశాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ కుర్రాడే చాలా ఏళ్లు పాటు మణిశర్మ దగ్గర పని చేస్తూ ఎంతోమంది స్టార్ హీరోస్ కి కూడా పరిచయం ఉన్న సాయి అని తెలియదు. సాయి ఏంటి కొత్తగా అని అనుకుంటున్నారా.? అవును ఎస్ఎస్ తమన్ పేరు సాయి. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు తమన్ ను సాయి అని పిలుస్తారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తమన్ కి చాలామంది దర్శకులతో ముందునుంచే పరిచయం ఉంది. దీనికి కారణం చాలామంది దర్శకులు మణి శర్మతో పనిచేయటం.
రీసెంట్ గా గేమ్ చేంజెర్ అనే సినిమాకి తమన్ సంగీతం వహించిన సంగతి తెలిసిందే. మామూలుగా శంకర్ సినిమాలకు ఒకప్పుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించే వాళ్ళు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అపరిచితుడు సినిమా మినహాయిస్తే వీరిద్దరూ కలిసి వరుసుగా సినిమాలు కు పనిచేశారు. అపరిచితుడు తర్వాత కూడా వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇక గేమ్ చేంజెర్ సాంగ్స్ విషయానికి వస్తే తమన్ మాట్లాడిన మాటలు కొన్ని వైరల్ గా మారాయి. ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో హుక్ స్టెప్ ఒకటి ఉండాలని, అలాంటి హుక్ స్టెప్ గేమ్ చేంజెర్ సినిమాలో లేదు అంటూ తమన్ కామెంట్ చేశాడు. సినిమా రిలీజ్ కంటే ముందు తమన్ ఒకటి మాట్లాడాడు సినిమా రిలీజ్ తర్వాత ఇంకొకటి మాట్లాడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది.
తాజాగా తమన్ స్టేట్మెంట్ పై స్పందించాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. జాక్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో తమన్ చెప్పిన ఆ మాటలకు మీరు ఏమంటారు అని జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు. నేను ఖచ్చితంగా తమన్ మాటలతో ఒప్పుకుంటాను, జాక్ సినిమాలో కూడా హుక్స్ స్టెప్ ఉంది, అలానే డీజే టిల్లు సినిమాలో కూడా హుక్ స్టాప్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే ఆ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. సిద్దు ప్రస్తుతం తెలుసు కదా, జాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.ఇక తమన్ 100వ సినిమా గా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తమన్ నెక్స్ట్ లెవెల్ లో కూర్చోబెట్టింది. చాలామంది స్టార్ హీరోలకి తమన్ సంగీతం అందించే స్థాయికి తీసుకొచ్చాడు త్రివిక్రమ్.
Also Read : Gopichandh: ఎందుకు అంత సాహసం గురు.? కథ పైన నమ్మకమా.?