Singer Chinmayee:ప్రముఖ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్న చిన్మయి శ్రీపాద (Chinmayi Sri Pada) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో సినిమాలలో పాటలు పాడడంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెబుతూ మరింత పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కు డబ్బింగ్ చెప్పి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది చిన్మయి. ఒకవైపు తన కెరీర్ ను కొనసాగిస్తూనే.. మరొకవైపు సమాజంలో ఆడవారికి, చిన్నపిల్లలకు ఎదురయ్యే సంఘటనలపై స్పందిస్తూ.. వారికి అండగా నిలుస్తూ ఉంటుంది. గతంలో మీటూ ఉద్యమంలో లిరికల్ రైటర్, వైరముత్తు పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసిన ఈమె అప్పటినుండి సినిమా పాటలకు దూరమై.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా దూసుకుపోతోంది.
వైరల్ గా మారిన అలహాబాద్ హైకోర్టు తీర్పు..
అలా సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలిచే చిన్మయి.. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై మండిపడుతూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ.. ఈ మేరకు ఒక పోస్ట్ కూడా పెట్టింది. అసలు విషయంలోకి వెళితే, 2021లో జరిగిన సంఘటనకు సంబంధించి, ఒక కేసు విచారణకు రాగా.. అందులో పవన్, ఆకాష్ అనే వ్యక్తులు ఒక పదకొండేళ్లు చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితులు బాధిత చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకొని ఆమె పైజామాను తీసేసే ప్రయత్నం చేశారు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ ఘటనను గమనించి, వెంటనే బాలికను రక్షించి, ఆ తర్వాత పవన్, ఆకాష్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా.. వీరిపై కేసు నమోదు అయింది. ఇక తాజాగా ఈ కేసు విచారణకు రాగా హైకోర్టు దీనిపై స్పందిస్తూ.. దీనిని రేప్ గా పరిగణించలేమని తెలిపింది. ఇలాంటి చర్యలను రేప్ కింద పరిగణించలేము కానీ పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించవచ్చు అంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది.
Naga Chaitanya – Shobhita: తొలిప్రేమ అక్కడే అలా మొదలైంది.. ఎట్టకేలకు లవ్ జర్నీపై ఓపెన్ అయిన జంట..!
మీ కూతుర్ని రక్షించే బాధ్యత మీదే – చిన్మయి..
దీనిపై సింగర్ చిన్మయి స్పందిస్తూ..” భారతదేశం రేప్ క్యాపిటల్ అవ్వడానికి ఇది ఒక పెద్ద కారణం. మీకు సామర్థ్యం ఉంటే.. అవకాశం వస్తే, మీ కూతురుతో కలిసి ఇండియా వదిలి మీరు వెళ్లిపోండి. లేదా మీ కూతురు నైనా ఇండియా వదిలి వెళ్ళిపొమ్మని చెప్పండి. మీ కూతుర్లను కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గం. దయచేసి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ ఇది ఒకసారి బాగా ఆలోచించుకోండి” అంటూ పోస్ట్ చేసింది. అంతే కాదు ఈ తీర్పుకు సంబంధించిన వార్తను కూడా ఆమె షేర్ చేసింది. దీంతో పలువురు నెటిజన్లు ఇండియాలో ఉంటూ ఇలా తప్పుగా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది హైకోర్టు తీర్పు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే సింగర్ చిన్మయి చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rape Capital for a reason.
If you have means and if you can, leave the country with your daughter. Or ask your daughter to leave the country.
This is the only way to Bachao your Betis. pic.twitter.com/eSf13jDFmK
— Chinmayi Sripaada (@Chinmayi) March 19, 2025