Oil For Healthy Hair: జుట్టు బలంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే జుట్టు చిట్లిపోవడం , రాలిపోవడం ప్రారంభమవుతుంది. ఎంత పొడవైన, ఒత్తైన జుట్టయినా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఊడిపోతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాస్త జుట్టు రాలినట్లు అనిపించినా కూడా మీరు మీ జుట్టు పట్ల కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అంతే కాకుండా జుట్టును బలంగా చేసుకోవడానికి మంచి హెయిర్ ఆయిల్ వాడాలి.
బయట మార్కెట్‌లో దొరికే హెయిర్ ఆయిల్‌కు బదులుగా వంటగదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడవచ్చు. వీటిని వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
బలమైన జుట్టు కోసం హెయిర్ ఆయిల్:
ఉసిరిని చాలా సంవత్సరాలుగా జుట్టుకు ఉపయోగిస్తున్నారు. ఉసిరి పౌడర్ లేదా నేరుగా కాయలను ఉపయోగించి కూడా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు.
కావాల్సినవి:
ఉసిరి కాయలు- 2
నువ్వుల నూనె- 2 స్పూన్లు
కొబ్బరి నూనె- తగినంత
ఎలా తయారు చేయాలి ?
ఈ ఆయిల్ తయారు చేయడం కోసం తీసుకున్న ఉసిరి కాయలను నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి. తర్వాత వీటిని నీడలో గంటసేపు ఆరబెట్టండి. అనంతరం ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో ముందుగా తీసుకున్న మోతాదుల్లో నువ్వుల నూనె, కొబ్బరి నూనెలను వేసి మిక్స్ చేయండి. వీటిని 5 నిమిషాలు వేడి చేయడం. ఆయిల్ మరుగుతున్నప్పుడు ఉసిరి ముక్కలును వేసి మిక్స్ చేయండి. 10 నిమిషాలు వేడి చేసి దీనిని వడకట్టండి. తర్వాత ఒక గాజు గ్లాసులో వడకట్టండి. దీనిని వారానికి రెండు సార్లువాడితే అద్భుత ఫలితాలు ఉంటాయి.
ఈ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేసి తలకు మాసాజ్ చేయండి. 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. బయట మార్కెట్ లొ దొరికే హెయిర్ వాడేబదులు ఈ హెయిర్ వాడటం మంచిది.
బలమైన జుట్టు కోసం హెయిర్ ఆయిల్ :
కావాల్సినవి:
మందార ఆకులు- కప్పు
మందార పువ్వులు- 2
ఆర్గానిక్ కొబ్బరి నూనె- పావు కప్పు
బాదం నూనె- పావు కప్పు
Also Read: సన్ స్క్రీన్ ఎందుకు వాడాలో తెలుసా ?
ఎలా తయారు చేయాలి ?
ముందుగా.. మందార పువ్వులు , ఆకులను చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత వాటిని ఎండలో ఆరనివ్వండి. ఇప్పుడు ఒక గ్యాస్ పై గిన్నె పెట్టి, అందులోకి ఆర్గానిక్ కొబ్బరి నూనె, కప్పు బాదం నూనె వేయండి. నూనె బాగా వేడెక్కనివ్వండి . దానిలో మందార పువ్వులు , ఆకులను వేసి మరగనివ్వండి. గ్యాస్ ని తక్కువ మంట మీద పెట్టి నూనెను దాదాపు 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆయిల్ ఒక సీసాలో వడకట్టి నిల్వ చేయండి. తలస్నానం చేసే ముందు దీనిని జుట్టుకు పట్టించి 30 నిమిషాలు ఉంచి కడిగేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది.