BigTV English

MS DHONI: ధోని రిటైర్మెంట్…ఇదిగో ఇదే సాక్ష్యం ?

MS DHONI: ధోని రిటైర్మెంట్…ఇదిగో ఇదే సాక్ష్యం ?

MS DHONI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో…. మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ రిటర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్… పోరాడుతోంది. అయితే చెన్నై హోమ్ గ్రౌండ్ కావడంతో… అభిమానులు భారీ గానే స్టేడియానికి వచ్చారు.


Also Read:  LSG Vs MI: తిలక్ రిటైర్డ్ హర్ట్.. పాండ్యా పై ట్రోలింగ్.. అసలు ఈ వివాదం ఏంటి?

చెపాక్ స్టేడియానికి ధోని కుటుంబం


చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో… చెపాక్ స్టేడియానికి ధోని ఫ్యామిలీ కూడా… రావడం జరిగింది. ధోని ఫ్యామిలీ అంటే కేవలం సాక్షి ధోని అలాగే ఆయన కూతురు… అనుకుంటే పొరపాటే. ఎన్నడూ లేని విధంగా మహేంద్రసింగ్ ధోని పేరెంట్స్ కూడా వచ్చారు. చెన్నై మ్యాచ్ కోసం మహేంద్రసింగ్ ధోని తల్లి దండ్రులు రావడం గమనార్హం. చాలా సింపుల్ గా స్టేడియానికి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పేరెంట్స్… ఎంజాయ్ గా మ్యాచ్ చూస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలోనే.. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్, మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్… రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే లాస్ట్ మ్యాచ్ అని కొంతమంది అంటున్నారు. అందుకే తన కుటుంబం మొత్తం ఇవాళ చెన్నై మ్యాచ్కు వచ్చిందని చెబుతున్నారు. వాళ్ళ మధ్యలో మ్యాచ్ ఆడిన తర్వాత… ఇవాళ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెబుతున్నారు. ఈ దెబ్బకు సోషల్ మీడియాలో కూడా ధోని రిటైర్మెంట్ అనే హ్యాష్ టాగ్ కూడా వైరల్ అవుతుంది.

Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!

చెన్నై సూపర్ కింగ్స్ కు 5 ట్రోఫీలు తెచ్చిన మహేంద్ర సింగ్ ధోని

టీమిండియా కెప్టెన్ గా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోని… తన కెప్టెన్సీలో ఇండియాకు టి20 వరల్డ్ కప్, వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ అందించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత… చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా అఖండ విజయాలను అందించాడు మహేంద్రసింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఏకంగా ఐదు సార్లు చాంపియన్గా నిలిపిన ఏకైక కెప్టెన్ గా చరిత్రలో నిలిచాడు మహేంద్రసింగ్ ధోని. 2010, 2011 సంవత్సరాలలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో.. ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత 2018, 2021 అలాగే 2023 సంవత్సరాలలో కూడా టోర్నమెంట్ గెలుచుకుంది. ఆ తర్వాత సాధారణ ప్లేయర్ గానే చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని.

Related News

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

Big Stories

×