SVKrishnaReddy Bday Celebrations : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాజేంద్రప్రసాద్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేసిన రాజేంద్రప్రసాద్, ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఈయన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ చేసిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. చాలామంది దిగ్గజ దర్శకులతో పనిచేసిన అనుభవం రాజేంద్రప్రసాద్ కి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్లు చేయాలంటే రాజేంద్ర ప్రసాద్ ని సంప్రదిస్తారు కొంతమంది దర్శకులు. నేటి దర్శకలతో కూడా రాజేంద్రప్రసాద్ కి మంచి సంబంధాలు ఉన్నాయి.
Also Read : Miss World 2025 : మిస్టర్ వరల్డ్ లో మీరు పోటీ చేస్తారా.? రౌడీ హీరో పన్నీ రిప్లై
జాగ్రత్తగా మాట్లాడాలి
రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్కరికి మనోభావాలు దెబ్బ తినడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని మాటలు మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఒక మాట అనేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ప్రస్తుత కాలంలో రాజేంద్రప్రసాద్ తీరు చూస్తే చాలా దారుణంగా తయారయింది. రీసెంట్గా ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే వేడుకల్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముందుగా నిర్మాత అచ్చెన్న ఉద్దేశిస్తూ మీ సంగతి తర్వాత చెప్తా అన్నారు. ఆ తర్వాత ఆలీ పేరును ప్రస్తావిస్తూ ఏకంగా ఒక బూతు పదాన్ని ఉపయోగించారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో కష్టపడి, ఎన్నో అవకాశాలు అందుకొని, మంచి పేరు సంపాదించుకున్న కూడా, వయస్సు అయిపోతున్న ఈ తరుణంలో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి.
ఎన్టీఆర్ అవార్డు అంటే చప్పట్లు కొట్టరా
ఇకపోతే ఎన్టీఆర్ పేరు మీదట అవార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాను. అని చెప్పగానే అక్కడ ఉన్న సినిమా వాళ్ళంతా చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నాను అనగానే చప్పట్లు కొట్టరా అని అడిగిమరీ కొట్టించుకున్నారు. పైగా బుద్ధుందా లేదా అంటూ, బ్రెయిన్ పోయిందా అందరికీ అంటూ మాట్లాడారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రామారావు గారి గురించి చెబుతూ వాళ్ళ ఇంట్లో గొడ్ల చావిడలో పుట్టా అంటూ మళ్లీ తన ప్రస్తానాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఇదంతా ఒకరకంగా బానే ఉన్నా మధ్యలో కొన్ని వెటకారపు మాటలు బూతులు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాయి.
Also Read : Big TV Exclusive : రత్నంను ఆదుకోవడానికి పూరీతో పవన్ సినిమా… ఈయననే ఎందుకంటే..?