BigTV English

Ukraine Drone Attack: ఉక్రెయిన్ డ్రోన్ అటాక్.. రష్యాలో 40 యుద్ధ విమానాలు ధ్వంసం

Ukraine Drone Attack: ఉక్రెయిన్ డ్రోన్ అటాక్.. రష్యాలో 40 యుద్ధ విమానాలు ధ్వంసం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మునుపెన్నడూ చూడని విధ్వంసం ఇది. రష్యాలో ఏకంగా 40 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. ఇది రష్యాకు పెద్ద ఎదురు దెబ్బ. ఈ యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది మిసైళ్లో మరొక భారీ ఆయుధాలో కాదు. జస్ట్ డ్రోన్లతోనే ఈ అటాక్ చేసింది ఉక్రెయిన్. రష్యాని చావుదెబ్బ కొట్టింది. నిన్న మొన్నటి వరకూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చేతులెత్తేసిన తరుణంలో ఉక్రెయిన్ దాడికి దిగడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఉక్రెయిన్ దాడితో రష్యా ఉలిక్కిపడింది. దాదాపుగా కాళ్లబేరానికి వచ్చినంత పని చేసింది. రేపు సోమవారం టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధపడింది. ఈమేరకు రాయబారం వెళ్లింది. ఉక్రెయిన్ కూడా చర్చలకు సిద్ధమని సమాధానమిచ్చింది. మరి సోమవారం చర్చల్లో ఏం తేలుతుంది..? యుద్ధం మరింత ముందుకెళ్తుందా..? శాంతి చర్చలు ఫలిస్తాయా..? వేచి చూడాలి.


గట్టి దెబ్బ కొట్టిన ఉక్రెయిన్..

రష్యాతో పోల్చి చూస్తే ఉక్రెయిన్ వద్ద ఉన్న ఆయుధ సామగ్రి చాలా తక్కువ. టెక్నాలజీలో కూడా రష్యా చాలా ముందుంది. కానీ ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యాని గడగడలాడిస్తోంది. దానికి కారణం వారిలో ఉన్న తెగువ. కష్టనష్టాలు ఎదురైనా తగ్గేదే లేదనే మొండితనం. ఆ మొండితనం తోనే ఇన్నాళ్లూ రష్యాకి లొంగకుండా ఉక్రెయిన్ యుద్ధం చేస్తూనే వచ్చింది. దాని ఫలితం ఎలా ఉన్నా, కష్టాలు అనుభవిస్తున్నా కూడా రష్యాని వణికిస్తూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి మాత్రం ఈ యుద్ధంలో కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో డ్రోన్ దాడి జరిగింది లేదు. ఈసారి రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ పెద్ద ఎత్తున డ్రోన్‌ దాడులు చేపట్టింది. తూర్పు సైబీరియా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఎక్కువదూరం ప్రయాణించగలిగిన డ్రోన్లను శత్రుదేశం పైకి పంపింది. రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో రష్యాలోని మిలట్రీ యూనిట్లను ధ్వంసం చేసింది. ఒలెన్యా, బెలయాతోపాటు.. మొత్తం 4 మిలటరీ ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్ దాడులు చేసింది.


చర్చలకు ఆహ్వానించిన రష్యా..

ఉక్రెయిన్ ఈ దాడి గురించి గొప్పగా చెప్పుకుంటోంది. ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ చేపట్టిన ఈ కీలక ఆపరేషన్‌లో 40కి పైగా రష్యన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయని చెప్పింది. TU-95, TU-22ఎం3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్‌ క్రాఫ్ట్‌ కూడా ఈ దాడిలో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అటు రష్యా కూడా దాడిలో తాము తీవ్రంగా నష్టపోయినట్టు ధృవీకరించింది. దాడికి సంబంధించిన వీడియోలు రష్యా మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. ఈ దాడుల నేపథ్యంలో రష్యా శాంతి మంత్రం పఠించడం విశేషం. ఉక్రెయిన్ ను ఆ దేశం చర్చలకు ఆహ్వానించింది. మధ్యే మార్గంగా టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్ ని వేదికగా చేసుకున్నారు. ఉక్రెయిన్ తరపున ఆ దేశ మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ నేతృత్వంలోని బృందం ఈ చర్చలకు వెళ్తుంది. ఈమేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చర్చల పురోగతిని తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×