STR49 : హీరో శింబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో శింబు చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఉండేది. చాలామందికి శింబు సినిమాలుపై మంచి అంచనాలు ఉండేవి. ఆయన ఎన్నుకున్న కాన్సెప్ట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అందుకే ఇప్పటికి శింబు కు మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. వల్లభ సినిమా ఇప్పటికీ చాలామందికి ఒక ఫేవరెట్ ఫిలిం. అలానే మన్మధ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాలన్నీ కూడా యూత్ ను విపరీతంగా ఆకర్షించాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన విన్నాయ తాండ వరువాయ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో ఏ మాయ చేసావే పేరుతో నాగచైతన్య హీరోగా తీశాడు గౌతం. ఈ రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
థగ్ లైఫ్ లో కీలక పాత్ర
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కమల్ హాసన్ స్క్రిప్ట్ లో ఓల్డ్ ఐడియా ఒకటి మణిరత్నం కి విపరీతంగా నచ్చిందట. అయితే కమల్ హాసన్ ఇచ్చిన ఆ ఓల్డ్ ఐడియాతో మణిరత్నం ఒక కొత్త స్క్రిప్టును తయారు చేశాడట. కమల్ హాసన్ ఐడియాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మణిరత్నం తన సొంత రూట్ లో కథను తయారు చేశారు. ఈ సినిమాలో శింబు ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. మొదట ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నారు అని అధికారికంగా ప్రకటించిన తరువాత కొన్ని కారణాల వలన దుల్కర్ తప్పిపోవలసి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఒక కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్నారు శింబు.
కాలేజీ స్టూడెంట్ గా
శింబు స్టూడెంటుగా కనిపించిన వల్లభ, మన్మధ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయబోయే 49వ సినిమాలో కూడా శింబు స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా కాలేజ్ ఈవెంట్ లో ప్రకటించాడు. దర్శకుడు వచ్చి తనకు కథ చెప్పిన తర్వాత మీరు ఈ సినిమాలో స్టూడెంట్ రోల్ లో కనిపించబోతున్నారు అని చెప్పారు. నేను నిజంగా స్టూడెంట్లా మీకు అనిపిస్తున్నానా అని అడగగానే క్రౌడ్ అంతా కూడా 100% అంటూ సమాధానం ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇప్పుడు రాబోయే థగ్ లైఫ్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read : Big TV Kissik Talks: యూట్యూబర్స్ పై శివాజీ రాజా ఊహించని కామెంట్స్.. అప్పట్లో ఏం చేసేవారో తెలుసా అంటూ..?