Murder In Hotel| ఒక మహిళ తన ప్రియుడిని హత్య చేసి.. ఆ తరువాత తెలివిగా అది ఆత్మహత్యగా చిత్రీకరించింది. మృతుడి ఫోన్ నుంచి ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు అతని కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. అయితే ఆమె చేసిన చిన్న తప్పు కారణంగా మృతుడి కొడుకు, పోలీసులు కలిసి ఆమెను పట్టుకున్నారు. సినిమాను తలపించే ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని మలాడ్ ప్రాంతానికి చెందిన బిజినెస్ మ్యాన్ ఇమాముద్దీన్ అన్సారీ (48) మే 4, 2025న ఒక 5 స్టార్ హోటల్ రూమ్ లో శవమై కనిపించాడు. అంతకుముందు హోటల్ గదిలో అతని ప్రియురాలు బర్కత్ (44)తో కలిసి వెళ్లాడు. అయితే హోటల్ వెళ్లే సమయంలో బర్కత్ తన ముఖం కనిపించకుండా బుర్కా ధరించి ఉంది. హోటల్ లోకి వెళ్లాక కొన్ని గంటల తరువాత బర్కత్ బుర్కాలోనే తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ అన్సారీ మాత్రం బయటికి రాలేదు.
మరసుటి రోజు అన్సారీ కొడకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని.. ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉందని తెలిపాడు. పోలీసులు వెంటనే అన్సారీ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి ఆ హోటల్ రూంకు వెళ్లారు. అక్కడ అన్సారీ అర్ధనగ్నంగా పడి ఉన్నాడు. అది చూసి వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆయన అప్పటికే మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. అయితే అన్సారీని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా మెసేజ్ చేశారని అన్సారీ కొడుకు పోలీసులకు చెప్పాడు. దానికి కారణం.. అన్సారీ చదువుకోలేదు. అతనికి రాయడం రాదు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వచ్చిన మెసేజ్ లో తన భార్య పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉంది. అయితే రాయడం రాని అన్సారీ అంత పెద్ద మెసేజ్ ఎలా చేయగలరిన అతని కొడుకు పోలసులకు అనుమానం వ్యక్తం చేశాడు.
Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన
అప్పుడు పోలీసులు హోటల్ రిసెప్షన్ లో అన్సారీ ఎవరితోనైనా కలిసి వచ్చాడా? అని దర్యాప్తు చేశారు. హోటల్ రిసెప్షన్ లో అన్సారీ చెక్ ఇన్ చేసిన సమయంలోని సిసిటీవి వీడియో చూశారు. అందులో అన్సారీతో ఒక మహిళ ఉంది. ఆమె అన్సారీ భార్య అని హోటల్ సిబ్బంది పోలీసులకు చెప్పారు. చెక్ ఇన్ సమయంలో ఇచ్చిన ఆధార్ కార్డులను కూడా చూపించారు. ఆ ఆధార్ కార్డులలో మహిళ పేరు బర్కత్ అని ఉంది. ఆ బర్కత్ మరెరవో కాదు అన్సారీ బావమరిది భార్య అని అతని కొడుకు పోలీసులకు తెలిపాడు.
అక్రమ సంబంధమే కారణం
అన్సారీ భార్య సోదరుడి భార్యే బర్కత్. ఆమె తన ఆడపడుచు భర్త అయిన అన్సారీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో గొడవలు జరిగి చివరికి ఆమెకు విడాకులిచ్చాడు. బర్కత్ తన భర్త నుంచి విడిపోయాక జైపూర్ లో తన తల్లి వద్ద నివసిస్తోంది. కానీ అన్సారీతో మాత్రం అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది. అన్సారీ తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసేది. కానీ అందుకు అన్సారీ నిరాకరించడంతో బర్కత్ అతనిపై పగబట్టింది. అందుకే తన ప్రియుడు అన్సారీతో ప్రేమగా నటించి హోటల్ లోకలిసేందుకు పిలిచింది. అక్కడ అతడిని హత్య చేసి అతడి ఫోన్ నుంచి ఆత్మహత్య మెసేజ్ పంపింది. ఆ తరువాత ఎవరికీ తెలియకుండా బుర్కాలోనే ముంబై నుంచి సూరత్ వెళ్లి అక్కడి నుంచి జైపూర్ వెళ్లిపోయింది.
పోలీసులు అనుమానంతో ఆమె ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి ఆమెను జైపూర్ లో అరెస్ట్ చేశారు. ఆ తరువాత ముంబై తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.