Simran Controversy :సినిమా ఇండస్ట్రీ అన్నాక నటీనటుల మధ్య గొడవలు రావడం సహజం. కేవలం నటీనటుల మధ్యనే కాదు దర్శక నిర్మాతలకు,దర్శకులకు, హీరోలకు, నిర్మాతలకు ఇలా ఎంతోమంది మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొంతమంది ఆ గొడవలను పక్కనపెట్టి సినిమా చేస్తే.. మరి కొంత మంది గొడవలు పెద్దవి చేసి సినిమాని మధ్యలోనే ఆపేస్తారు.ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా కోలీవుడ్ లో నాలుగు వారాల నుండి ఒక వివాదం చెలరేగుతోంది. అదే సీనియర్ హీరోయిన్లు అయినటువంటి సిమ్రాన్ (Simran) జ్యోతిక (Jyothika) ల వివాదం.. అయితే తాజాగా ఈ వివాదానికి పులిస్టాప్ పడినట్లు అయింది.మరి ఇంతకీ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం..
జ్యోతిక – సిమ్రాన్ మధ్య విభేదాలు.. సిమ్రాన్ క్లారిటీ..
తాజాగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే మూవీలో నటించిన సిమ్రాన్ తన సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరికీ థాంక్స్ చెప్పింది. అంతేకాకుండా రాజమౌళి (Rajamouli ) వంటి దిగ్గజ దర్శకుడి నుండి ప్రశంసలు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నాకు జ్యోతికతో ఉన్న గొడవ సద్దుమణిగింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. నేను మాట్లాడిన మాటలు వక్రీకరించారు. ముందు జ్యోతికే ఆంటీల పాత్రలు, అమ్మల పాత్రలు చేయడం కంటే ఈ పాత్రలో చేయడం మేలు అని నాతో చెప్పింది.ఆ తర్వాత నేను డబ్బా రోల్స్ అని చెప్పాను. కానీ ఆ మాటలు నేను జ్యోతికను ఉద్దేశించి అనలేదు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు జ్యోతిక నాకు కాల్ చేసి మరీ తప్పుగా మాట్లాడాను.. క్షమించు అని సారీ చెప్పింది.ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయి. కానీ ఈ విషయాన్ని ఇప్పటికీ కొంత మంది వైరల్ చేస్తున్నారు. మా మధ్య ఎలాంటి గొడవ లేదు” అని సిమ్రాన్ చెప్పింది.
అసలేం జరిగిందంటే..?
ఇక గతంలో ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో సిమ్రాన్ మాట్లాడుతూ.. “ఇలాంటి డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీ, బామ్మ పాత్రలు చేయడమే మేలు.. నేను ఓ హీరోయిన్ కి ఫోన్ చేసి అందులో మీ పాత్ర బాగుందని మాట్లాడితే.. ఆంటీ పాత్రలు చేయడం కంటే ఈ పాత్ర చేయడం బెటర్ కదా అని కౌంటర్ ఇచ్చింది. కానీ అలాంటి డబ్బా రోల్స్ చేయడం కంటే ఇవే బెటర్ అని సిమ్రాన్ మాట్లాడింది. ఇక సిమ్రాన్ మాట్లాడింది జ్యోతికని ఉద్దేశించేనని, జ్యోతిక నటించడం డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ కి సంబంధించే అని.. సిమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేసిందని చాలామంది జ్యోతిక ఫ్యాన్స్ ఈ వివాదాన్ని ముదిరేలా చేశారు. అలా తాజాగా సిమ్రాన్ కామెంట్లతో సీనియర్ హీరోయిన్ల గొడవకి పులి స్టాప్ పడింది.