Singer Pravasthi : బుల్లితెర సింగింగ్ షో పాడుతా తీయగా పై సింగర్ ప్రవస్తి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ షో నుంచి ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారంటూ ఆరోపిస్తూ గత రెండు మూడు రోజులుగా వరుసగా సోషల్ మీడియాలో వీడియోలను రిలీజ్ చేస్తుంది సింగర్ ప్రవస్తి.. ఆ వీడియోలు అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.. అయితే అసలు ఈ ప్రవర్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నిజంగానే ఆమెకు షోలో అన్యాయం జరిగిందా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రవస్తి కొన్ని భయంకరమైన నిజాలను బయటపెట్టింది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
సింగర్ ప్రవస్తి vs సింగర్ సునీత..
తనను అన్యాయంగా షో నుంచి ఎలిమినేట్ చేశారని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీతపై ప్రవస్తీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రవస్తి చేసిన వ్యాఖ్యలపై సింగర్ సునీత స్పందించారు. తనకు జరిగిన అన్యాయం విషయం లేవనెత్తిన విషయాలు సూటిగా సమాధానం చెప్పలేదు. వాటికి మీరు జవాబు చెబుతారని ఆశిస్తున్నాను అంటూ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. అందులో ప్రవస్తి ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. 19 ఏళ్ల వయసులో నేను ఒడిలో కూర్చోబెట్టుకోలేనని అన్నారు. నన్ను మీ ఒడిలో కూర్చొబెట్టుకోమని అనలేదు. అలాంటి ప్రేమ, ప్రోత్సాహం కోరుకొన్నాను. మీరు అలా మాట్లాడటం సరికాదు.. పాటల సెక్షన్ల విషయంలో కూడా నాకు అన్యాయమే జరిగిందని ప్రవస్తి మరో వీడియోలో బయటపెట్టింది. అయితే మొత్తానికి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య వార్ జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబ్ ఛానల్ కి నమస్తే ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఈ వివాదాలకి అసలు కారణం ఏంటో బయటపెట్టింది.
Also Read :కాంట్రవర్సీలతో పాపులర్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?
సింగర్ ప్రవస్తి ఎందుకు ఇలా చేస్తుంది..?
సింగర్ ప్రవస్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగిందని, పాటల సెలెక్షన్స్ దగ్గర నుంచి ఏది తనకు నచ్చినట్టుగా కాదు ఒక స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ళు చేస్తున్నారంటూ బయట పెట్టింది. వాళ్ళు ఏది పాడమంటే అది పాడాలి ఏది చేయమంటే అది చేయాలి అంటూ దారుణంగా మాట్లాడింది. ఇక చివరగా ఈ గొడవలన్నీ ఎప్పుడు ఆపేస్తావని అందులో యాంకర్ అడగ్గా.. ఈ షోపై జనాలకు ఉన్న అభిప్రాయాన్ని మారేంతవరకు నేను పోరాడుతూనే ఉంటాను అని ప్రవస్తి అంటుంది. ఈ షో సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది. ఇందులో సింగర్స్ కి అన్యాయం జరుగుతున్న పోరాడుతున్నాను.. ఈ షోనీ జనాలు పూర్తిగా చూడడం మానేయాలి. ఇలా అన్యాయాలు చేస్తూ మరో సీజన్ కూడా వస్తుంది కాబట్టి జనాలు గట్టిగా బుద్ధి చెప్పాలి అని
ప్రవస్తి కోరుకుంటుందని స్పష్టత వచ్చేసింది.. తనలాంటి ఎంతోమంది సింగర్స్ ఇలాంటి షోల వల్ల జీవితాన్ని పోగొట్టుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ప్రవస్తి. మరి గొడవ ఎంత దూరం వెళుతుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా ప్రవస్తి ఇలా చెయ్యడం తప్పు అని కొందరు సోషలో వాదిస్తున్నారు..