BigTV English

OTT Movie : పోలీసులను పరుగులు పెట్టించే క్రైమ్ … ఒక్కో ట్విస్ట్ కు బుర్ర బద్ధలు అవ్వాల్సిందే

OTT Movie : పోలీసులను పరుగులు పెట్టించే క్రైమ్ … ఒక్కో ట్విస్ట్ కు బుర్ర బద్ధలు అవ్వాల్సిందే

OTT Movie : ఓటిటిలో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఆదరణ పొందుతున్నాయి.  రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో పోలీసులే ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు.  ఈ మూవీ స్టోరీ చివరివరకూ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Nnetflix) లో

ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నాయట్టు’ (Nayattu). 2021 వచ్చిన ఈ మూవీకి మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించారు.ఇందులో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ పోలీసు వ్యవస్థలోని అవినీతి, రాజకీయ ఒత్తిళ్లును వెలికితీస్తూ ఒక థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమా 2023 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డ్ గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ప్రవీణ్ మైఖేల్ ఒక కొత్త సివిల్ పోలీసు అధికారిగా, కొత్తగా బాధ్యతలు తీసుకుంటాడు. పోలీసు స్టేషన్‌లో, అతను సీనియర్ అధికారి మణియన్, సునీతతో స్నేహం చేస్తాడు. ఒక స్థానిక రాజకీయ గుండా బిజు, తన అల్లరి చర్యల కారణంగా స్టేషన్‌కు పిలుస్తారు.  బిజు ఒక దళిత రాజకీయ పార్టీకి చెందినవాడు. రాజకీయ ప్రభావం కారణంగా అతన్ని విడుదల చేయాలని ఒత్తిడి వస్తుంది. ఈ క్రమంలో ప్రవీణ్, మణియన్ బిజుతో ఘర్షణ పడతారు. ఆ తరువాత అతన్ని విడుదల చేస్తారు. ఒక పెళ్లి పార్టీ తర్వాత, మణియన్, ప్రవీణ్ మద్యం సేవించి, సునీతతో కలిసి కారులో తిరిగి వస్తుంటారు. మణియన్ మేనల్లుడు రాహుల్ డ్రైవ్ చేస్తున్న కారు ఒక మోటార్‌బైక్‌ను ఢీకొడుతుంది. బైక్ రైడర్ జయన్, బిజు స్నేహితుడు, ఈ ప్రమాదంలో మరణిస్తాడు. రాహుల్ భయపడి పరారవుతాడు. మిగిలిన ముగ్గురు జయన్‌ను రక్షించే ప్రయత్నం చేస్తారు. కానీ అతను ఆసుపత్రిలో చనిపోతాడు. ఈ సంఘటన బిజు గ్యాంగ్‌లో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

ఈ ముగ్గురు పోలీసు అధికారులు తమపై హత్యా నేరం మోపబడుతుందని తెలుసుకుని, స్టేషన్‌కు తిరిగి వెళతారు. అయితే, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు నేరస్థులను చేస్తారని గ్రహించి, పారిపోయేందుకు ప్లాన్ చేస్తారు. వీళ్ళు ఒక రహస్యమైన ప్రదేశంలో తల దాచుకుంటారు. ఈ సమయంలో ఒక పోలీసు బృందం, అనురాధ నేతృత్వంలో, వీరిని వెతకడం ప్రారంభిస్తుంది. నగరంలో, రాజకీయ నాయకులు ఈ సంఘటనను ఎన్నికల కోసం ఉపయోగించుకునేందుకు ఒక డ్రామా ఆడతారు. వారు ముగ్గురు అధికారులను అరెస్టు చేసినట్లు నటిస్తూ, మీడియాకు డమ్మీ పోలీసులను చూపిస్తారు. చివరికి వీళ్ళు అరెస్ట్ అవుతారా ? ఈ కేసునుంచి బయట పడతారా ? పొలిటికల్ గా ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అమ్మాయిలతో బాత్రూమ్ లో దారుణంగా ఆ పని చేసే సైకో … ట్విస్ట్ లతో పిచ్చెక్కించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×