Tollywood : తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు సక్సెస్ సినిమాలతో సెలబ్రిటీలు అయ్యారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస హిట్ సినిమాలతో స్టార్ ఇమేజ్ ని అందుకున్నారు. అయితే ప్రస్తుతం మీరందరూ ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉంటూ తమ పనేంటో తాను చూసుకుంటూ సినిమాల తో బిజీగా ఉన్నారు. కొందరు హీరోలు మాత్రం తమ సినిమాలను ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని కాంట్రవర్షలకు కేరాఫ్ తో మారారు. గతంలో చాలా మంది హీరోలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని గొడవల్లో కావాలని తలదూచ్చారు.. అలా కాంట్రవర్సీల తో పాపులర్ అయిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు..
ఒకప్పుడు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేందుకు హీరో కూడా జనాల్లోకి వెళ్లి, తమ సినిమా గురించి పదే పదే చెబుతూ ఆ సినిమాలోని కీలక అంశాల గురించి వివరిస్తూ ప్రమోషన్స్ చేసేవారు. ఈమధ్య కొంతకాలంగా హీరోలు జనాల్లో కావాలని గొడవ పడుతూ పబ్లిసిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. అలా తమ సినిమాలకు ముందు పబ్లిక్ స్టంట్ చేసి జనాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కొంతవరకు మాత్రమే ఫలిస్తాయి. వివాదాల వల్ల సక్సెస్ అయిన సినిమాలు ఇప్పటివరకు లేవని చెప్పాలి. ఈ మధ్య పబ్లిక్ లో క్రేజ్ ను పెంచుకొనేలా క్రియేట్ చేసుకున్న హీరోల ఎవరు? వారు నటించిన సినిమాలు ఏవో చూద్దాం…
Also Read :భారత్ – పాక్ మధ్య వార్.. పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడు..?
కాంట్రవర్సీలో ఇరుక్కున్న స్టార్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొందరి హీరోలు ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరికొందరేమో ఫ్యామిలీ లో హీరోలు ఉండడం వల్ల వారిద్వారా సినిమాల్లోకి వచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కారు సిగ్నల్ దగ్గర ఆగితే తన బౌన్సర్స్ లతో కొట్టించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. రామ్ చరణ్ వివరణ కూడా ఇచ్చాడు. విరాటపర్వం సినిమా ప్రమోషన్ల టైమ్ సాయి పల్లవి, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో హిందూ పండిట్లను అన్యాయంగా చంపడం చూపించారు.. అప్పుడు ఇది బాగా వైరల్ అయ్యింది. అలాగే కుష్బు తమిళనాడులో 2005 లో ఓ కేసు నమోదు అయ్యింది. ఇక అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. ఆ టైంలో అల్లు అర్జున్ ను చెక్ చేయడానికి పోలీసులు కారు అద్దం కిందికి దింపాలని అడిగితే ఆయన వినిపించుకోలేదు ఆ తర్వాత పోలీసులు వదిలేశారు. ఇలా స్టార్ హీరోలు మాత్రమే కాదు కుర్ర హీరోలు కూడా తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి పబ్లిక్ స్టంట్ లు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యారు.. ఏది ఏమైనా కూడా ఇంత పెద్ద స్టార్లు ఇలాంటి వాటిల్లో ఇరుక్కోవడం అప్పట్లో ఓకే.. కానీ ఇప్పట్లో ఇలా జరిగితే ఇండస్ట్రీలో పెద్ద తుఫానే వస్తుందని తెలుస్తుంది..