Singer Neha..సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆడవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి నటనా రంగంలోనే ఉందని అందరూ అంటున్నారు. కానీ ఎప్పుడైతే ‘పాడుతా తీయగా’ కార్యక్రమం నుంచి సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిందో.. ఇప్పుడు ఒక్కొక్కరిగా తమ బాధలను బయట పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Bala Subrahmanyam) హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయం లో తాను చైల్డ్ సింగర్ గా పార్టిసిపేట్ చేశానని, అప్పుడు తనను చాలా బాగా చూసుకున్నారని, కానీ ప్రస్తుతం తన వయసు 19 సంవత్సరాలు.. ఇప్పుడు బాడీ షేమింగ్ తో పాటు అవమానించారని , తనపై పక్షపాతం చూపించారని , ప్రత్యేకించి బొడ్డు కిందకు చీర కట్టుకొని మరీ రమ్మన్నారని ఇలా పలు విషయాలపై ఆరోపణలు చేస్తూ తన బాధను వెళ్ళబుచ్చుకుంది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aaradhya).
అయితే సింగర్ ప్రవస్తీపై కొంతమంది మండిపడితే, మరికొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా సింగర్ గీతామాధురి (Geeta Madhuri) కూడా ప్రవస్తికి అండగా నిలిచింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ప్రముఖ సింగర్ నేహా (Singer Neha ) కూడా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” తనకు తెలియకుండానే తన కెరియర్ నాశనం చేశారు” అంటూ తెలిపింది.. ముఖ్యంగా ప్రముఖ మేల్ సింగర్ శ్రీకృష్ణ (Sri Krishna) పై సింగర్ నేహా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రీకృష్ణ నాకు కెరియర్ లేకుండా చేశారు – సింగర్ నేహా..
సింగర్ నేహా మాట్లాడుతూ..” మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman ) అసిస్టెంట్ శ్రీకృష్ణ నన్ను చాలా అవమానించారు. నేను ఎన్నో సినిమాలలో పాటలు పాడాను. ప్రత్యేకించి ఒక పాటతో మరింత పాపులర్ అయ్యాను. ఇక ఆ పాట కారణంగా పలు షోలకి కూడా కొంతమంది అడ్వాన్స్ ఇచ్చి, నన్నే పాడమని చెప్పారు. దాంతో సంతోషం వేసింది.అయితే సడన్ గా నాలుగైదు రోజులుగా వరుసగా నేను చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. అయితే ఒక రోజు ఒక పెద్ద షో నిర్వాహకులు కూడా నన్ను ఆహ్వానించి, అడ్వాన్స్ ఇచ్చి, సారీ ఈ షో మీరు చేయొద్దండి అని చెప్పారు. ఇలా నాలుగు రోజుల నుంచి షో లన్నీ వరుసగా క్యాన్సిల్ అవుతుంటే, తట్టుకోలేక ఒక షో మేనేజర్ ను అడిగాను. ఆయనేమో.. శ్రీకృష్ణ గారే మీ షో లన్ని క్యాన్సిల్ చేయమని చెప్పారు.. దయచేసి మీరు ఈ విషయాన్ని ఆయనతో అడగకండి.. మా జాబ్ పోతుంది అంటూ వేడుకున్నారు. అయితే అప్పుడు నేను నమ్మలేదు. శ్రీకృష్ణ అన్నయ్య , నేను ఒకే ఊరికి చెందిన వారం.. అన్నయ్య ఎందుకు నన్ను తొక్కేయాలని చూస్తారు.. అని నాలో నేనే మదనపడ్డాను
also read ;Singer Kousalya: ప్రవస్తి మాత్రమే కాదు.. నన్ను కూడా.. సింగర్ కౌసల్య ఆవేదన..!
స్టేజ్ పైనే నన్ను ఘోరంగా అవమానించారు – సింగర్ నేహా
అయితే ఒకసారి ఒక స్టేజ్ పైన ఒక పాట కోసం పర్టిక్యులర్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఆ పాట శ్రీకృష్ణ అన్నయ్యతో కలిసి పాడాల్సి వచ్చింది. కానీ అన్నయ్య నాతో కలిసి పాట పాడడానికి ఇష్టపడలేదు. వారు మాత్రం తప్పకుండా పాడాల్సిందే అంటూ పట్టుబడ్డారు. అప్పుడు శ్రీకృష్ణ అన్నయ్య నా గొంతు బాగాలేదు అన్నారు. ఆ గొంతు బాగా లేనప్పుడు ఆ పాటకు ఒకటే గొంతు బాగలేదా..? మిగతా అన్ని పాటలు పాడారు కదా అని వారే అన్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని స్టేజ్ పై నాతో పాట పాటడానికి వచ్చారు. అయితే పాట పాడుతుండగానే.. కేవలం మూడు లైన్లు పాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో నేను అవమాన భారంగా ఫీలయ్యాను. అంతకుముందు వారు చెబుతుంటే నమ్మలేదు కానీ నాతో పాడడం ఇష్టం లేక అన్నయ్య వెళ్లిపోవడం చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఇక ఆ తర్వాత అప్పటినుంచి శ్రీకృష్ణ తో నేను మాట్లాడలేదు. ఇక తర్వాత కొన్ని షోల నుంచి కాల్స్ వచ్చాయి కానీ వారు శ్రీకృష్ణ బ్యాచ్ అయితేనే పాడండి అని చెప్పారు.. ఇక అప్పటినుంచి నాకు అవకాశాలు లేవు” అంటూ నేహా కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే శ్రీకృష్ణ ఎందుకు తనతో ఇలా బిహేవ్ చేశాడు అనే విషయం ఇప్పటికీ తనకు తెలియదని చెప్పింది నేహా.