Actor Nandu: టాలీవుడ్ యాక్టర్ నందు 100% లవ్ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో అజిత్ పాత్రలో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసినా, ఎక్కువగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో, విలన్ గా నటిస్తున్నారు. నందు చిన్నతనం నుండే నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. నందు, సింగర్ గీతామాధురిని 2016లో వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు కలరు. వీరిద్దరూ కలిసి షార్ట్ ఫిలిమ్స్ లోను నటించారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. వారి లైఫ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఇప్పుడు నందు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అసలు నందు ఏం పెట్టాడో ఇప్పుడు చూద్దాం..
ఈ దరిద్రాన్ని వద్దని వదిలేస్తున్నావ..
తాజాగా నందు తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. నేను అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకుంటున్నాను. దానికి కారణం నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ని చూడడం వల్ల నా టైమంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకుంటున్నాను.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని మళ్లీ తిరిగి మీ ముందుకు రేపు వస్తాను అంటూ నందు పోస్ట్ చేశారు. ఇది చూసిన వారంతా ఈరోజుకి మాత్రమే సెలవు తీసుకొని రేపు రావడం అని భలేగా పెట్టావు అంటూ.. ఈ దరిద్రాన్ని వద్దని వదిలేస్తున్నావని అనుకున్నాము.. మళ్లీ రేపు వస్తున్నావా అని.. కొంతమంది నేను నీ దారిలోనే నడుస్తాను అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నందు భలే ఫన్నీగా ఈ పోస్ట్ చేశాడని అభిమానులు అంటున్నారు.
గుర్తింపు తెచ్చిన సినిమాలు ..
నందు యాంకర్ గా,తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కు కామెంటేటర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. నందు తెలుగుతోపాటు తమిళంలోనూ నటించారు. ఆయన మొదటి సినిమా ఫోటో. తర్వాత ప్రేమించే రోజుల్లో, ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన 100% లవ్ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఆటోనగర్ సూర్య, పెళ్లిచూపులు, జయ జానకి నాయక, రాజు గారి గది 2, కుటుంబ కథా చిత్రం, శివరంజని ,బొమ్మ బ్లాక్ బాస్టర్ వంటి సినిమాలలో నటించారు. గత సంవత్సరం సుహాస్ హీరో గా వచ్చిన ప్రసన్న వదనం సినిమాలో నటించి మెప్పించారు. నందు తన కెరియర్ లో 365 డేస్స్, బెస్ట్ యాక్టర్స్, సవారి వంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు 2017 సైజ్ జీరో సినిమాలో హీరో ఆర్యకు డబ్బింగ్ చెప్పింది నందు. ఇప్పటివరకు నందు 20 పైగా సినిమాలలో నటించారు. గీత మాధురి తో కలిసి వెబ్ సిరీస్ లోను నటించారు. 2023 లో వచ్చిన మాన్షన్ 24, వధువు అనే వెబ్ సిరీస్ లలో నటించారు. నందు మరెన్నో సినిమాలతో,వెబ్ సిరీస్ లతో,మన ముందుకు రావాలని కోరుకుందాం.