Ester Noronha : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత సమస్యల కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది పెళ్లి, విడాకుల వంటి విషయాలతోనే జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అసలు కొందరు సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ? ఎప్పుడు విడిపోతున్నారో కూడా తెలియకుండా మారిపోయింది పరిస్థితి. అలాంటి స్టార్ కపుల్ ఎస్తేర్ నోరోన్హా (Ester Noronha), నోయెల్ (Singer Noel Sean). పెళ్లి చేసుకున్న 6 నెలల్లోనే విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ విడాకుల విషయాన్ని వెల్లడించినప్పుడు నోయెల్ రియాక్షన్ ఏంటి ? అనే విషయాన్ని వెల్లడించింది.
విడాకుల గురించి చెప్పినప్పుడు నోయెల్ రియాక్షన్
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఎస్తేర్ కు “విడాకులు కావాలని అన్నప్పుడు నోయల్ రియాక్షన్ ఏంటి?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఎస్తేర్ స్పందిస్తూ “అసలు నమ్మలేదు. ఎందుకంటే ఏంటిది? అలా ఎలా చెప్తావు? సొసైటీని ఎలా ఫేస్ చేస్తావు? నీకు తెలుసు కదా సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుందో. నువ్వు నన్ను వదిలేసి వెళ్లినా… నేను నిన్ను వదిలేసి వెళ్లినా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు” అని చెప్పుకొచ్చింది.
“అయితే ఇప్పటిదాకా చాలా మందికి నేనే అతన్ని వదిలేసాను అని చెప్పాను. కానీ నోయెల్ వదిలేసి మంచి పని చేశాడులే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నమ్మలేకపోతున్నారు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా… అబ్బాయి తప్పు చేసినా కూడా అమ్మాయి వదిలేసి వెళ్లడం అనేదాన్ని సొసైటీ ఒప్పుకోదు. అబ్బాయి తప్పు చేసినా సరే, అమ్మాయి ఉండాలి అని సొసైటీ చెప్తుంది. అలాంటి ఒక సొసైటీలో… లేదు తను రాంగ్ చేస్తున్నాడు, నేను బయటకు వస్తాను అని చెప్తే కూడా… నేనే రాంగ్ అవుతున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చింది.
పెళ్ళైన 6 నెలలకే విడాకులు
టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా, బిగ్ బాస్ ఫేమ్ సింగర్ నోయల్ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సింగర్ గా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాప్ సింగల్ నోయెల్ ‘బిగ్ బాస్ సీజన్ 4’లో కంటెస్టెంట్ గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి అనారోగ్య కారణాలతో ఆయన మధ్యలోనే బయటకు వచ్చాడు. కాగా 2019 జనవరి 3న నోయెల్ ఎస్తేరును ప్రేమించి, పెళ్లాడాడు. కానీ మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో, 2019 జూన్ నెలలో విడిపోయారు. 2020 సెప్టెంబర్ నెలలో ఈ జంట విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఎస్తేర్, నోయెల్ విడివిడిగా ఉంటూనే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయ్యారు. సింగర్ గా, నటుడిగా రాణిస్తూనే మరోవైపు రియాల్టీ షోలతో బిజీగా గడుపుతున్నాడు నోయెల్.
ఎస్తేర్ కూడా విడాకులు తీసుకున్నప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన ‘1000 అబద్దాలు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’ వంటి సినిమాల్లో నటించింది ఎస్తేర్. కాని ఆశించిన ఫేమ్ మాత్రం రాలేదు.