Asia Cup 2025 T20 Format: ఆసియా ఖండంలోని జట్ల మధ్య పోరుకు వేదికగా నిలిచే ఆసియా కప్ టోర్నమెంట్ ఈ సంవత్సరం జరగబోతోంది. నివేదికల ప్రకారం సెప్టెంబర్ రెండవ వారం నుండి నాలుగవ వారం వరకు ఆసియా కప్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2026 లో జరగబోయే టి-20 వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని.. ఈ ఆసియా కప్ ని టి-20 ఫార్మాట్ లో {Asia Cup 2025 T20 Format} నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఈ ఆసియా కప్ 2025 కి భారతదేశం అతిథ్యం ఇవ్వాల్సి ఉండేది.
Also Read: India vs Pakistan: ఈ ఏడాది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మరో మూడు మ్యాచ్ లు.. ఫైనల్ కూడా?
కానీ భద్రతా కారణాల దృశ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్.. పాకిస్తాన్ కి వెళ్లలేదు. దీంతో ఆసియా కప్ కోసం భారత్ కి పాకిస్తాన్ వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025 ని తటస్థ వేదికలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ {ఎసిసి} ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ టోర్నీని శ్రీలంక లేదా దుబాయ్ లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, యూఏఈ, ఒమన్.. ఇలా 8 జట్లు పాల్గొంటాయి.
ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. పోటీలోని మొదటి రౌండులో ప్రతి జట్టు రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఆ దశలో రెండు గ్రూపులలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు సూపర్ ఫోర్ కి చేరుకుంటాయి. ఇక సూపర్ ఫోర్ దశలో నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో తలపడతాయి. ఇందులో మరో ఆరు మ్యాచ్లు జరుగుతాయి. ఇలా మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు ఫైనల్ కీ చేరుకుంటాయి. ఈ టోర్నీని భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో చూడవచ్చు.
ఇక 1984 నుంచి ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్ టోర్నీలలో భారత జట్టు ఏడుసార్లు విజయం సాధించింది. 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023.. ఇలా ఏడుసార్లు విజేతగా నిలిచింది. ఇక భారత్ వర్సెస్ పాకిస్తాన్ మెగా పోరుపై ఫోకస్ పెట్టిన ఎసిసి అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్ ఖరారు చేయనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ టోర్నీలో భారత్ – పాక్ గరిష్టంగా మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.
Also Read: Ban vs Pak: పాకిస్తాన్ ను వరుణుడు.. లేకపోతే బంగ్లా చేతిలో పరువు పోయేదే?
చివరిగా 2023 ఆసియా కప్ లో భారత్ – పాకిస్తాన్ మూడుసార్లు తలపడేలా షెడ్యూల్ ని రూపొందించారు. కానీ గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కానీ సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ జట్టు నీ భారత్ చిత్తు చేసింది. దీంతో పాకిస్తాన్ సెమీస్ లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరుకోలేకపోయింది. ఆ తర్వాత టైటిల్ పోరులో శ్రీలంకను ఓడించి భారత జట్టు విజేతగా నిలిచింది.
🚨Asia Cup 2025 In T20 Formats🚨
• 8 Teams
• 19 Games
• India vs Pakistan likely to play 3 times
• UAE or Sri Lanka as Venue
• Sep 2nd week to Sep 4th week
• T20I Formats
• India, Pak, SL, Ban, Afg, UAE, Oman,
Hong Kong
• Rohit & Virat Retirement of T20
•… pic.twitter.com/dxqm56BKrn— Gurlabh Singh (@Gurlabh91001251) February 28, 2025