BigTV English

Singer Sunitha: పాటలు పాడుతూ సింగర్ సునీత ఇన్ని కోట్లు సంపాదించిందా..? మొత్తం ఎన్ని కోట్లో తెలుసా..?

Singer Sunitha: పాటలు పాడుతూ సింగర్ సునీత ఇన్ని కోట్లు సంపాదించిందా..? మొత్తం ఎన్ని కోట్లో తెలుసా..?

Singer Sunitha: టాలీవుడ్ ప్రముఖ గాయని సింగర్ సునీత అంటే తెలియని వారు ఉండరు. తన మధురమైన గానంతో శ్రోతలను అలరిస్తారు. అందమైన గాత్రమే కాదు, అందమైన రూపము ఆమె సొంతం. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఆమె తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సినిమాలలో పాటలు పాడుతూ సింగర్ సునీత టాప్ పొజిషన్లోకి వెళ్లారు. ఇప్పుడు ఆమె ఎన్ని కోట్లకు అధిపతో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆమె ఆస్తి విలువెంతో మనము చూసేద్దాం..


మెలోడీ క్వీన్ ..అందాల గాయని ..

అందం, మధురమైన గానం ఒకరిలోనే ఉంటే ఆమె సునీత. మే 10న మరో వసంతంలోకి అడుగు పెట్టారు సునీత. వయసు జస్ట్ నెంబర్ అంతే.. అది ఆమె కెరియర్ కి అడ్డుపడదు అని 46 వసంతాలు పూర్తి చేసుకున్న సునీత రుజువు చేశారు. ఇప్పటికీ ఆమె తెలుగులోనే కాక కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ సుమారు 3 వేలకు పైగా పాటలు పాడారు. ఈమె ఏ పాట పాడిన ఆ పాటకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు అనే పాటతో సునీత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరస పాటలతో టాప్ సింగర్ గా ఎదిగారు. దాదాపు ఇప్పటికీ 500 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె రెండు చేతులా సంపాదించారు. ఇవేకాక ఆమె రియాల్టీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాడుతా తీయ్యగా సింగింగ్ షో కి ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆమె రెండవ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని. ఆయనను పెళ్లాడిన తర్వాత ఆమె ఆస్తి పై ఎన్నో రూమర్స్ వెల్లివిరిశాయి. ఆమె ఆస్తి వేలకోట్లు అంటూ అప్పట్లో సోషల్ మీడియా కోడై కూసింది.


సింగర్ సునీత ఇన్ని కోట్లు సంపాదించిందా..

సునీత వివాహం చేసుకున్న రామ్ వీరపనేని బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి ఇండియాలో స్థిరపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయనకు మంచి పేరు ఉంది. వ్యాక్యూడ్ అవుట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కి కొన్ని సంవత్సరాలుగా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన మ్యాంగో మీడియా ద్వారా ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు పాటలను విడుదల చేసి కోట్ల రూపాయల లాభాలను అందుకున్నారు. ఆయన తన కెరియర్ మొదట్లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఆ తర్వాత బిజినెస్ వైపు అడుగులు వేస్తూ.. ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్తగా కోటీశ్వరుడు గా సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రామ్ వీరపనేని ఆస్తి విలువ వేల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఆయనకు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కొన్ని వందల కోట్లు. ఆయన రెండు చేతుల సంపాదిస్తున్నారు. అటు మీడియా, ఇటు యూట్యూబ్ ఛానల్స్ ఈవెంట్ పార్ట్నర్షిప్స్, వంటి బిజినెస్ తో భారీ లాభాలను అందుకుంటున్నారు. రామ్ వీరపనేని వివాహం తర్వాత సునీత ఆస్తి వేల కోట్లకు చేరింది. వీరి ఇరువురికి వందల కోట్ల రూపాయల షేర్స్ ఉన్నాయని సమాచారం. హైదరాబాదులో పెద్ద రియల్ ఎస్టేట్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయని టాక్. బిజినెస్ ని చూస్తూనే ఆయన భారీ ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక సునీత ఆమె ఆస్తి గురించి ఎన్నోసార్లు ప్రశ్నించిన తనకి రామ్ ఆస్తి గురించి తెలియదని, ఆయన కంపెనీ టర్న్ అవర్ ఎంతో తెలియదని.. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది, ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×