Pakistan Earthquake: పాక్‌కు వరుస షాక్‌లు.. దెబ్బ మీద దెబ్బ.. ప్రకృతి కూడా సహకరించని పరిస్థితి ఏర్పడింది. ఏ రకంగా చూసిన కూడా పాకిస్థాన్‌లో శాంతి నెలకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అయితే భారత్‌లో యుద్ధం ఉద్రిక్తతను ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ అతలాకుతలం అవుతుంది. ఇక ప్రకృతి కూడా తాండవించడంతో.. ప్రకృతి కూడా పాకిస్థాన్ పై పగబట్టినట్టుగా ప్రళయాన్ని సృష్టించడంతో.. పాక్ ప్రజలు ఆందోళనకు గురవుచున్నారు.
శనివారం తెల్లవారు జామున పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రజలు అయితే తీవ్ర భయాందోళనకు గురి చెందుతున్నట్లు తెలుస్తుంది. అయితే నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ NSC ప్రకారం ఈ భూకంపం శనివారం తెల్లవారు జామున 1.44 గంటల సమయంలో సంభవించినట్లు తెలుస్తుంది. అయితే భూకంప కేంద్రంగా టర్కీ ప్రాంతం గుర్తించింది. దీని ప్రభావం ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలపైన కూడా కనిపిస్తుంది. ఈ రిక్టార్ స్కెల్ పైనా దీని ప్రభావం 4.0 గా నమోదయినట్లు ఇప్పటికే (NCS) ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్‌లోని, ఖైబర్ పఖ్తున్ఖ్వా పంజాబ్, బెలూచిస్తాన్ ప్రాంతంలో అయితే స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తుంది. వీటి కారణంగానే నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురి చెంది ఇంటి నుంచి బయటకు పరుగులు తీసారు. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏం జరగలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.
Also Read: రాజౌరీలో పాకిస్తాన్ కాల్పులు.. భారత్ కీలక అధికారి మృతి
ఇదిలా ఉండగా.. ఇటీవల భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆ దేశంపై సైతం ప్రకృతి పగబట్టిందని పలువురు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దాంతో భాతర్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 6-7 మధ్య భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి 24 మిస్సైల్స్‌తో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ మే 8 నుంచి భారత్‌లోని 15 నగరాలపై దాడికి ప్రయత్నించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి యత్నించగా.. వాటిన్నింటిని భారత రక్షణ వ్యవస్థ కూల్చివేసింది.