Single Movie Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. గత ఏడాది స్క్వాగ్ మూవీతో అందరి ముందుకు వచ్చిన ఈయన ఈ మూవీతో మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్న ఈ ఏడాది సింగిల్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మే 9న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ టాక్ ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది. మొదటిరోజు నాలుగు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ వీకెండ్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్లు మోత మోగిస్తుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు మూడు రోజులకు ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..
సింగల్ మూవీ కలెక్షన్స్..
కార్థిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా సరదాగా సాగుతుంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ మధ్య సీన్లు ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాయి.. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. మొదటి రోజు ఏకంగా నాలుగున్నర కోటి వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. రెండో రోజున రూ.7.05 కోట్లు దక్కించుకుంది. ఇలా రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ.11.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.
ఇక మూడో రోజుకు ఈ మూవీ మొత్తం 16.30 కోట్లు వసూళ్లు చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ కలెక్షన్లు శ్రీ విష్ణు కెరీర్‌లోనే అత్యధికంగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా థియేటర్లు నిండుగా ఉండటంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది..
#SingleMovie grosses over 16.3CR+ in 3 Days !#Single #SingleMovie #SreeVishnu #Tollywood #BIGTVCinema @sreevishnuoffl pic.twitter.com/x224ISpMZN
— BIG TV Cinema (@BigtvCinema) May 12, 2025
Also Read : రూటు మార్చిన మంచు మనోజ్.. డిఫరెంట్ స్టోరీతో మూవీ..
అమెరికాలో దుమ్ము దులిపేస్తున్న సింగిల్..
తెలుగులో మాత్రమే కాదు అటు అమెరికాలో కూడా ఈ సినిమా కలెక్షన్లు మోత మోగిచ్చేస్తుంది. మూడు రోజులు కూడా అక్కడ మంచి కలెక్షన్స్ ని వసూలు చేసింది. అమెరికాలో కూడా ఈ చిత్రం రెండు రోజుల్లో $300k మార్క్‌ను దాటేసింది. వీకెండ్ ముగిసే నాటికి అర మిలియన్ డాలర్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘బుక్ మై షో’ ప్రకారం, విడుదలైన 24 గంటల్లోనే 80 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయని ఓ వార్త వినిపిస్తోంది. ఇదే జోరులో మరికొన్ని రోజులు గనక ఈ సినిమా కలెక్షన్స్ ని వసూలు చేస్తే ఇది కూడా హిట్ అవుతుంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ మరియు ఇతర నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. వెన్నెల కిశోర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.. ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి సినిమాలు చూసి కడుపుబ్బ నువ్ వేసుకుంటారు.. మొత్తానికి శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్ సినిమా పడిపోయింది. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది.