Indian Trains Light: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. పాతతరం రైళ్ల స్థానంలో అత్యాధునిక రైళ్లు అందబాటులోకి వస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో తయారవుతున్న ఈ రైళ్లు.. రైల్వే దశ, దిశను మార్చుతున్నాయి. రైళ్లు సాధారణంగా డే టైమ్ తో పోల్చితే, రాత్రి పూట ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంగా ప్రయాణించాలంటే రైలు లైటింగ్ వ్యవస్థ అనేది పక్బందీగా ఉండాలి. కనుచూపు మేరలో పట్టాలు స్పష్టంగా కనిపించేలా ఉండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైళ్లు ప్రయాణం చేస్తాయి. అయితే, ఇంతకీ రైలుకు ఎన్ని రకాల లైట్లు ఉంటాయి? వాటిలో మెయిన్ లైట్ ఫోకస్ ఎంత దూరం వరకు ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రైలుకు ఎన్ని రకాల లైట్లు ఉంటాయంటే?
రైలు ఇంజిన్ కు సాధారణంగా మూడు రకాల లైట్లు ఉంటాయి. వాటిలో ఒకటి మెయిన్ లైట్ లేదంటే హెడ్ లైట్ అని పిలుస్తారు. మిగతా రెండింటిలో ఒకటి రెడ్ కలర్, మరొకటి వైట్ కలర్ లో ఉంటుంది. వీటిని లోకో మోటివ్ ఇండికేషన్స్ అంటారు. ఇంతకీ వీటితో కలిగే ప్రయోజనాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ హెడ్ లైట్: రైలుకు ఉండే ప్రధానమైన లైట్ ను హెడ్ లైట్ లేదంటే మెయిన్ లైట్ అంటారు. కొత్తగా వస్తున్న రైళ్లలో వీటిని ఇంజిన్ మధ్య భాగంలో అమర్చుతున్నారు. గతంలో ఈ లైట్ ను ఇంజిన్ పై భాగంలో ఉంచేవారు. ఇది రాత్రిపూట దారి చూడ్డానికి ఉపయోగపడుతుంది. ఇది 24 వోల్ట్ ల డీసీ కరెంట్ తో పని చేస్తుంది. ఈ లైట్ ఫోకస్ సుమారు 350 నుంచి 400 మీటర్ల వరకు ఉంటుంది. ఈ హెట్ లైట్ లో ప్రస్తుతం రెండు బల్బులను వాడుతున్నారు. రాత్రిపూట రైలు వెళ్లే సమయంలో ఒక బల్బ్ ఫెయిల్ అయినా, మరో బల్బ్ పని చేయాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణంలో హెడ్ లైట్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే, ప్రతి రోజు రైలు తన ప్రయాణాన్ని ముగించిన తర్వాత కచ్చితంగా చెక్ చేసే భాగాల్లో రైలు హెడ్ లైట్ ఉంటుంది.
Read Also: ప్లాట్ ఫారమ్ టికెట్ ఎందుకు పెట్టారు? ఇదీ అసలు కథ!
⦿ రెడ్, వైట్ బల్బులు: ఇంజిన్ మెయిన్ లైట్ తో పాటు రెడ్, వైట్ కలర్ లో మరో రెండు లైట్లు ఉంటాయి. ఇంజిన్ ను సెంటింగ్ కోసం రివర్స్ లో నడపాల్సి వచ్చినప్పుడు రెడ్ లైట్ ను లోకో పైలెట్ ఉపయోగిస్తాడు. ఈ లైట్ వేస్తే సెంటింగ్ కోసం రైలు ఇంజిన్ ఆపోజిట్ డైరెక్షన్ లో నడుపుతున్నాడని అర్థం చేసుకుంటారు. అదే సమయంలో ఇంజిన్ సెంటింగ్ కోసం ముందుకు వెళ్లాల్సిన సమయంలో వైట్ లైట్ ను ఉపయోగిస్తాయి. ఈ రెండు లైట్లను కేవలం సెంటింగ్ కోసం ఉద్దేశించి డిజైన్ చేశారు.
Read Also: ‘ఆపరేషన్ సిందూర్’.. జమ్ముకాశ్మీర్ పర్యాటక రంగానికి లాభమా? నష్టమా?