Single Trailer: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కేతిక శర్మ జంటగా నటిస్తున్న సినిమా సింగిల్. రొమాంటిక్ కామెడీ మూవీ గా రానున్న ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవిష్ణు గతంలో చేసిన సినిమాలు అన్ని కామెడీ జోనర్ లో వచ్చినవే, ఇప్పుడు అదే కోవలో వస్తున్న సింగిల్ సినిమా కావటంతో అభిమానులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి..
ట్రైలర్..ఇలా
టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. మొదట్లో ఈయన చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఆ తర్వాత సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సింగిల్ సినిమాతో మన ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లిమ్స్, సాంగ్స్ కి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్ తో శ్రీ విష్ణు మన ముందుకు వచ్చారు. ట్రైలర్ లో శ్రీ విష్ణు నటన అద్భుతంగా ఉంది.ట్రైలర్ మొదలవడంతోనే శ్రీ విష్ణు డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలను పడేయాలంటే మూడు దారులు రా గుడ్ బాయ్, నెంబర్ 2 బ్యాడ్ బాయ్, అండ్ 3 మాస్ బాయ్స్ అంటే మనమే అంటూ శ్రీ విష్ణు డైలాగ్స్ తో, వెన్నెల కిషోర్ కామెడీతో, ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇది చుసిన అభిమానులు ట్రైలర్ అంతా నవ్వులే నవ్వులు ఆఖరిలో ఏడిపించేసి మళ్లీ నవ్వించేసాడు హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బెస్ట్ మూవీ అవుతుందా …
ఇటీవల శ్రీవిష్ణు, ఆసీస్ గోలి దర్శకత్వంలో వచ్చిన స్వాగ్ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ, ఆ సినిమాలో శ్రీ విష్ణు నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో సింగిల్ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. శ్రీవిష్ణు సినిమాలలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరు, రాజరాజ చోరా, సామజ వరగమన వంటి సినిమాలలో నటించి సక్సెస్ ని అందుకున్నారు. సింగిల్ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కేతికా శర్మ, ఇవానా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా శ్రీ విష్ణు కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవ్వాలని మనము కోరుకుందాం.