BigTV English
Advertisement

Valentines Week Re-release movies: ప్రేమికుల రోజు స్పెషల్.. రీ-రిలీజ్‌కి సిద్ధమైన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్!

Valentines Week Re-release movies: ప్రేమికుల రోజు స్పెషల్.. రీ-రిలీజ్‌కి సిద్ధమైన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్!

Tollywood Valentine’s Week Re-releases Movies: ఫిబ్రవరి నెల వచ్చేసింది. ఈ నెల కోసం ఎందరో ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరిచేందుకు పడిగాపులు కాస్తుంటారు. అప్పటికే లవ్ ‌లో ఉండేవారు.. అప్పుడే తమ లవ్‌ను వ్యక్తపరిచేవాళ్లు తమ ప్రేయసి లేదా ప్రేమికుడికి సర్ప్రైజ్‌లు చేయాలని చూస్తుంటారు. ఇక ప్రేమలో ఉన్నవారే కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు.. అలాగే పెళ్లి చేసుకుని ప్రేమించుకున్న వాళ్లు కూడా ఈ నెలలో ఫిబ్రవరి 14ను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొందరేమో పార్కులకు, రెస్టారెంట్లకు వెళ్తే.. మరికొందరేమో ప్యూర్ లవ్ కాన్సెప్ట్‌లను చూసి ఎంజాయ్ చేయడానికి థియేటర్లకు వెళ్తుంటారు.


అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త సినిమాలు.. అలాగే కొన్ని పాత సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా.. పాత లవ్ స్టోరీ మూవీస్ కూడా రీరిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అవేంటంటే..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ మూవీ రీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. 1995లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సినీ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ సినిమా రీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.


READ MORE: Pawan Tholi Prema : తొలిప్రేమ రీ రిలీజ్.. థియేటర్ ధ్వంసం..రాజకీయ రచ్చ..

ఈ మూవీతో పాటుగా దిల్‌తో పాగల్‌హై, మొహబ్బతే లాంటి క్లాసిక్ సినిమాలు కూడా థియేటర్లలో ప్రేక్షక ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

ఇక వీటితో పాటుగా తెలుగు సినిమాల విషయానికొస్తే.. సూర్య హీరోగా నటించిన ‘సన్నాఫ్ కృష్ణన్’ మూవీ కూడా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. 2008లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే రీరిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్‌న రాబట్టింది. మళ్లీ ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా రీరిలీజ్ కాబోతుంది.

అలాగే సిద్ధార్థ్, షామిలి కాంబోలో వచ్చిన చిత్రం ‘ఓయ్’. ఈ సినిమా కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మ్యూజిక్ అంటే సినీ ప్రియులలో మంచి క్రేజ్ ఉంది.

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని ఎన్ని సార్లు రీ రిలీజ్ చేసినా సినీ ప్రియులు థియేలర్ల వద్ద బారులు తీరుతారు. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ రీరిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ బుకింగ్స్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి.

READ MORE: Raviteja: రీ-రిలీజ్‌​కి సిద్ధమైన మాస్​ మహారాజ సూపర్​ హిట్​ మూవీ

అంతేకాకుండా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. ఈ మూవీకి సైతం ప్రత్యేక ప్రీమియర్లకు రెడీ చేస్తున్నారు.

పనిలో పనిగా హాలీవుడ్ రొమాంటిక్ లవ్ మూవీ టైటానిక్ కూడా ప్రేమికులను పలకరించడానికి సిద్ధమైంది. అలాగే తమిళ్ డబ్బింగ్ మూవీ ట్రూ లవర్ కూడా రీరిలీజ్‌కు సిద్దమైంది. మరి ఈ మూవీలన్నింటిలో సినీ ప్రేమికులు ఏ సినిమాను సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×