BigTV English

Sitara Ghattamaneni : తండ్రి బాటలోనే కూతురు.. బర్త్ డే రోజు సితాపాప ఎంత మంచిపని చేసిందో తెలుసా ?

Sitara Ghattamaneni : తండ్రి బాటలోనే కూతురు.. బర్త్ డే రోజు సితాపాప ఎంత మంచిపని చేసిందో తెలుసా ?

Sitara Ghattamaneni 12th Birthday(Tollywood news in telugu): సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఆయన ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకూ వెయ్యిమంది పిల్లలకు పైగా హార్ట్ ఆపరేషన్లు చేయించారు. అంతేకాదు.. శ్రీమంతుడు సినిమాలో ఊర్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్టుగా.. రియల్ గా కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావలసిన అవసరాలను అందిస్తున్నారు. ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించడం, పేద పిల్లలు చదువుకునేందుకు సహాయం చేయడం.. ఇవన్నీ పైకి తెలిసినవి మాత్రమే. ఇంకా మహేష్ చాలా సేవాకార్యక్రమాలే చేస్తున్నాడని ఫ్యాన్స్ చెబుతుంటారు.


మహేష్ గారాల కూతురు సితార కూడా.. తండ్రి బాటలోనే నడుస్తోంది. 2012 జూలై 20న పుట్టిన సితార.. ఇటీవలే తన 12వ పుట్టినరోజును జరుపుకుంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లల పుట్టినరోజులను చాలా గ్రాండ్ గా జరుపుకుంటుంటారు. హోం టౌన్ కు దూరంగా.. విదేశాల్లో గడుపుతుంటారు. కానీ.. మన సితా పాప అలా కాదు. తన పుట్టినరోజు.. ఇంకొకరి జీవితంలో వెలుగులు నింపాలని అనుకుంది. అందుకే చదువుకోవాలని ఉన్నా.. ఆశయాన్ని చేరుకునేందుకు పేదరికం అడ్డొస్తున్న ఓ అమ్మాయికి సహాయం చేసింది.

Also Read : ఆస్పత్రి నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ డిశ్చార్జ్


సాధారణ పేద కుటుంబానికి చెందిన నవ్య అనే అమ్మాయి నీట్ పరీక్ష రాసి పాసైంది. కానీ.. డాక్టర్ చదువు చదివేందుకు ఆర్థిక స్తోమత లేదు. ఈ విషయం.. మహేష్ ఫ్యాన్స్ ద్వారా ఫౌండేషన్ కు తెలిసింది. నవ్య డాక్టర్ చదువు పూర్తయ్యేంతవరకూ.. ఫీజులు, ఆమె చదువుకు సంబంధించిన అన్ని ఖర్చులను మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా అందిస్తామని ప్రకటించారు.

ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న సితార ఘట్టమనేని.. నవ్యకు అడ్వాన్స్ గా 1,25,000 రూపాయల చెక్కును అందించారు. అలాగే సితార చేతులమీదుగా నవ్యకు ల్యాప్ టాప్, స్టెతస్కోప్ ను అందజేశారు. తన చదువుకు ఇంత సాయం చేస్తున్న మహేష్ బాబు ఫౌండేషన్ కు, సితారకు నవ్య కృతజ్ఞతలు తెలిపింది. ఇంత మంచిపని చేసిన సితారను నెటిజన్లు అభినందిస్తున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Mahesh Babu Foundation (@mbfoundationorg)

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×