Kingdom First Single : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రానున్న సినిమా కింగ్డమ్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం మే 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఓ ఇంటరెస్టింగ్ అప్డేట్ ను మూవీ టీం ప్రకటించింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
మొదటి పాట ..
విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోరు హీరోయిన్ గా మన ముందుకు రానున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమాలో విజయ్ ఒక ప్రత్యేకమైన లుక్ లో రఫ్ గడ్డంతో మాస్ యాంగిల్ లో మనకి కనిపిస్తారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్ కి ఎంతో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడతారు అన్న పేరు ఉంది. అనిరుద్ మ్యూజిక్ చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమాలు అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా కింగ్డమ్ సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ నుంచి వస్తున్న మొదటి పాట.. ఆ పాటకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడనే అప్డేట్ తో విజయ్ ఫ్యాన్స్ ఆ పాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వారాంతరంలో ఈ పాట మన ముందుకు రానుంది. కింగ్డమ్ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు.
ఆ సినిమాల తరువాత ..
ఈ సినిమా మొదట మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల మే 30కి వాయిదా పడింది.ఈ సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు.ఈ సినిమా హైదరాబాద్ విశాఖపట్నం కేరళ లొకేషన్స్ లో ఇప్పటికే షూటింగ్ 50% పూర్తి చేశారు.ఈ సినిమా తాజాగా రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో 24 గంటల్లో 10 మిలియన్స్ పైగా వ్యూస్ దాటి రికార్డును సృష్టించింది. ఈ టీజర్ ను సితార ఎంటర్టైన్మెంట్ వారు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి,ఫామిలీ స్టార్ సినిమాల తో మన ముందుకు వచ్చారు. ఆ సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు మన ముందుకు కింగ్డమ్ తో రానున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎటువంటి సన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
The trademark @anirudhofficial style of saying it 😁#Kingdom First Single ❤️ 🔜 https://t.co/aGFNtKZRcg
— Sithara Entertainments (@SitharaEnts) April 28, 2025