Masthan Sai : 300 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోల కేసులో మస్తాన్ సాయి (Masthan Sai) పేరు కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపింది. లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతడిని ఫిబ్రవరి 3న పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర 300 మంది అమ్మాయిలకు పైగా ప్రైవేట్ వీడియోలో ఉన్నాయంటూ లావణ్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్ అయ్యి, చంచల్ గూడా జైల్లో ఉన్న మస్తాన్ సాయిని తాజాగా నార్సింగ్ పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
నార్సింగ్ పోలీసుల అదుపులో…
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) వివాదంలో కీలక నిందితుడైన మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ ఎదురయ్యింది. నిందితుడు మస్తాన్ సాయి (Masthan Sai) కస్టడీకి కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయిని 2025 ఫిబ్రవరి 3న అరెస్టు చేసిన నార్సింగ్ పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ కోర్టు మూడు రోజుల కస్టడికి అనుమతిని ఇచ్చింది. ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు అతన్ని కస్టడీలోకి తీసుకోవచ్చునని సూచించింది కోర్టు.
ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 13వ తేదీన మస్తాన్ సాయిని పోలీసులు విచారించబోతున్నట్టు టాక్ నడిచింది. తాజా సమాచారం ప్రకారం మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడా జైలులో ఇప్పటిదాకా రిమాండ్ లో ఉన్న మస్తాన్ సాయిని ఇప్పుడు నార్సింగ్ పోలీసులు విచారించబోతున్నారు. మూడు రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని, కేసు విషయమై పలు కీలకమైన విషయాలను రాబట్టబోతున్నారు. మస్తాన్ సాయిని సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ కేసుల్లో రీసెంట్ గా అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.
300ల మంది ప్రైవేట్ వీడియోలు
కొన్ని రోజుల క్రితం మస్తాన్ సాయి (Masthan Sai) 300ల మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని లావణ్య చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఆధారాలతో సహా లావణ్య అతను అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు పోలీసులకు కంప్లయింట్ చేసింది. తనకు మస్తాన్ సాయి నుంచి ప్రాణహాని ఉంది అంటూ అతని బండారాన్ని బట్టబయలు చేసింది.
తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నాయని, ఆ హార్డ్ డిస్క్ కోసం అతను తనపై దాడి చేశాడని కంప్లయింట్ లో పేర్కొంది. అలాగే తనను డ్రగ్స్ కేసులో ఇరికించాలి అనుకున్నారు అంటూ పలు ఆడియోలను రిలీజ్ చేసింది లావణ్య. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఏపీలో కూడా డ్రగ్స్ కేసులో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.