బీహార్ లోని బరౌని రైల్వే జంక్షన్ లో ఘోరం జరిగింది. రైలు ఇంజిన్- బోగీ మధ్య ఓ రైల్వే ఉద్యోగి ఇరుక్కుపోయి అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని సోన్ పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్‌లో పనిచేస్తున్న పోర్టర్ అమర్ కుమార్ రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి ప్లాట్ ఫారమ్ 5 మీద పని చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు మధ్యన అతడు ఇరుక్కుపోవడాన్ని గమనించిన ప్రయాణీకులు కేకలు వేయడంతో ట్రైన్ డ్రైవర్ దిగి పారిపోయాడు. ఇంజిన్, బోగీ మధ్య ఇరుక్కుపోయిన ఉద్యోగి మృతదేహాన్ని బయటకు రైల్వే అధికారులు బయటకు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This is Barauni Junction Platform 5 of Bihar.
Train number 15204, shunt man died during shunting, on top of that, when the public raised an alarm, the driver fled from the spot instead of moving the engine forward…👇🏻 Barauni Junction Quetta Railway Stationये बिहार के बरौनी… pic.twitter.com/vRioobDh1A
— sarita (@sarita_5M) November 9, 2024
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
లక్నో-బరౌనీ ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు అమర్ కుమార్ రావు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో లోకో పైలెట్ సడెన్ గా రైలును రివర్స్ తీసుకొచ్చారు. మందస్తుగా ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా రైలు రావడంతో ఆయన గుర్తించలేకపోయారు. తేరుకునే లోపే ఇంజిన్ వచ్చి తగిలింది. రైలు ఇంజిన్-బోగీ మధ్యలో ఇరుక్కుపోయాడు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
లోకో పైలెట్ నిర్లక్ష్యంతోనే..
లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఇంజిన్ ను రివర్స్ తీసుకురావడం వల్లే ఈ దారుణం జరిగినట్లు ఫ్లాట్ ఫారమ్ మీద ఉన్న ప్రయాణీకులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే అధికారులు ఇంజిన్ ను ముందుకు తీసుకెళ్లి, అరుణ్ డెడ్ బాడీని బయటకు తీశారు. అనంతరం రైల్వే పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.
విచారణ మొదలుపెట్టిన రైల్వే పోలీసులు
అటు అరుణ్ కుమార్ మృతి ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. “ప్రస్తుతం ఈ కేసు విచారిస్తున్నాం. ఘటనకు రైలు డ్రైవర్ కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నాం. దర్యాప్తు తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇంజిన్ డ్రైవర్ దోషిగా తేలితే అతడిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని” వెల్లడించారు. అటు ఈ ఘటనను బరౌని రైల్వే యూనియన్ అధ్యక్షుడు శివప్రసాద్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. “రైళ్ల సంఖ్య పెరగడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తగిన సిబ్బంది లేకపోవడం ప్రాణాలు పోతున్నాయి. రైలు డ్రైవర్ తో సహా ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైలును యార్డుకు పంపితే అలారం మోగించే విధానం ఉంది. కానీ, ఈ ఘటనలో మోగించకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది’’ అని యాదవ్ వెల్లడించారు .