Krishnudu: కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న నటుడు కృష్ణుడు. కేవలం నటుడుగానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా కృష్ణుడు చేసిన వినాయకుడు సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఏ మాయ చేసావే, రామదండు, హ్యాపీడేస్ వంటి సినిమాలు మంచి పేరును తీసుకొచ్చి పెట్టాయి. తన జూనియర్స్ ని ర్యాగింగ్ చేసే వ్యక్తిగా హ్యాపీడేస్ సినిమాలో కనిపిస్తాడు కృష్ణుడు. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ శేఖర్ కమ్ముల కెరియర్ లో హ్యాపీడేస్ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఇప్పటికీ కూడా కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు కృష్ణుడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని రివీల్ చేశాడు.
షూటింగ్ నిమిత్తం ఒకసారి కృష్ణుడు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లారట. అయితే అప్పుడు అక్కడే కొనుక్కున్న ఒక కొత్త స్పోర్ట్స్ కార్ ఉంది. కృష్ణుడు కూడా చూసుకోకుండా వెళుతున్న తరుణంలో హెల్మెట్ తగిలి ఆ స్పోర్ట్స్ కారుకి ఒక పెద్ద గీత పడింది. ఆ స్పోర్ట్స్ కార్ వాల్యూ దాదాపు మూడు కోట్ల వరకు ఉంటుంది. ఆ రోజుల్లో మూడు కోట్లు అంటే మామూలు విషయం కూడా కాదు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగే టైం కి కృష్ణుడికి సరైన గుర్తింపు కూడా లేదు. అయితే కారు పైన గీత పడగానే మేకప్ మేన్ చూసి గట్టిగట్టుగా కృష్ణుడిపై అరవడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ కార్ ఎవరిదంటే అక్కినేని నాగార్జునది. ఈ అరుపులు విన్న నాగర్జున బయటకు వచ్చి కారును చూసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న నాగార్జున పరవాలేదు అమ్మ చూసుకోలేదు కదా ఏమి కాదులే వెళ్ళిపోవని కృష్ణుడిని వదిలేసారట. అదే మామూలుగా అయితే వేరొకరు అదే ప్లేస్ లో ఉంటే వ్యవహారం వేరేలా ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను నెటిజెన్స్ షేర్ చేస్తూ మా కింగ్ బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Varun Tej : లో బడ్జెట్ వలన నేను చేసిన ఆ సినిమా ఫెయిల్ అయింది
అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారి లెగిసిని కంటిన్యూ చేస్తున్నారు నాగార్జున. ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది హీరోలు ఉన్నారు. అయితే వీరిలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేసి వాళ్ళకంటూ కొంత గుర్తింపును సాధించుకున్నారు. సుమంత్ , సుశాంత్ లాంటి నటులు కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నారు.