BigTV English

Kanguva : డైరెక్టర్ శివ కొత్త పాలసీ… ఎంత ఎక్కువ అరిస్తే.. అంత పెద్ద హిట్..

Kanguva : డైరెక్టర్ శివ కొత్త పాలసీ… ఎంత ఎక్కువ అరిస్తే.. అంత పెద్ద హిట్..

అరిస్తే హిటా… ఇదేంటి…?
దాన్ని డైరెక్టర్ శివ ఎందుకు ఫాలో అవుతున్నాడు.?
దాన్ని పాలసీ అనడం ఏంటి..?
టైటిల్ చూసిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయా..? ఆ క్వశ్చన్స్‌కి సమాధానం చూద్ధాం రండి…


తెలుగులో బాహుబలి అనే ఓ అద్భుతం వచ్చింది. దీన్ని చూసి మిగితా ఇండస్ట్రీలో అచ్చం అలాంటి సినిమా చేయాలని కలలు కంటున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కొంత మంది సినిమాలు చేశారు కూడా. ఇలా తమిళ ఇండస్ట్రీ నుంచి కొన్ని సినిమాలు వచ్చాయి. పొన్నియన్ సెల్వన్ అని మణిరత్నం వచ్చాడు. అది తమిళియన్స్‌కి పర్లేదనిపించింది. కానీ, ఇతర భాష ఆడియన్స్‌కి పెద్దగా నచ్చలేదు.

ఇప్పుడు మళ్లీ బాహుబలి లాంటి సినిమా అంటూ కంగువ మూవీ వచ్చింది. కంగువ మూవీ అనేది తమిళ బాహుబలి అని, కోలీవుడ్‌కు ఫస్ట్ 1000 కోట్లు తెచ్చి పెట్టే అద్భుతం అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే నాటి నుంచి మూవీ టీం చెబుతున్న మాట ఇది. ఇంత అంటున్నారు కదా… అందులో కొంత వరకు అయిన నిజం అయితే బాగుండు అని సూర్య ఫ్యాన్స్ అనుకున్నారు.


కానీ, థియేటర్ కి వెళ్లి చూస్తే కానీ అర్ధమవలేదు. వచ్చింది సినిమాకు కాదు… తలనొప్పి తెచ్చుకునే చోటుకు అని.

కథ బాగున్నా… కథనం పర్లేదు అని అనిపించినా… ఈ తలనొప్పి అనే మాట ఎందుకు వస్తుంది అంటే… సినిమాలో ఉండేే ప్రధానమైన పాత్రలు మితిమీరి అరవడం. కంగువ పాత్రలో ఉన్న సూర్యతో పాటు ఓ చంటి పిల్లాడు… సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు అరుస్తూనే ఉంటారు.

సినిమాలో క్రొకడైల్ ఫైట్ హైలైట్ గా ఉంటుందని టీం ప్రతీ స్టేజ్‌పై చెప్పారు. ఆ క్రొకడైల్ ఫైట్ టైంలో కూడా ఆ… అరుపుల వల్ల ఆడియన్‌కి చిరాకు వేసి మొహం పక్కకు తిప్పుకుంటాడే తప్పా… ఆ ఫైట్ సీన్ చూసి మొచ్చుకోవడం లాంటివి చేయడు.

సినిమా క్లైమాక్స్ టైంలో ఆ చంటి పిల్లాడు చనిపోతాడు. నిజానికి ఆ చంటి పిల్లాడి కోసమే ఈ సినిమా అంతా. అలాంటి పిల్లాడు చనిపోతే… అది చాలా ఎమోషనల్ సీన్ వచ్చే టైం. కంగువ ఏడుస్తాడు కూడా. కానీ, థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్ మాత్రం “ఓ పని అయిపోయింది” అంటూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. అంటే అర్థం చేసుకోవాలి ఆడియన్స్‌ను ఆ క్యారెక్టర్ ఎంత ఇబ్బంది పెట్టిందో…

ఆ పిల్లాడు పోయాడు… ఇక అరుపులు ఉండవు అని అనుకుంటే… అప్పుడే క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఇస్తూ వస్తాడు మరో హీరో కార్తీ. రుద్రంగ నేత్ర అనే పాత్రలో కార్తీ కనిపించాడు. ఆ పాత్ర కూడా అదే అరవడం. ఇక చేసేదేం లేక… ఎండ్ కార్డ్ పడితే… ఈ అరుపుల ప్రపంచం నుంచి బయటికి వెళ్లిపోవచ్చు అని చూడటమే అయింది. కొద్ది నిమిషాలకే ఎండ్ కార్డ్ పడటంతో… హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదంత చూసిన తర్వాత డైరెక్టర్ శివ కొత్త పాలసీ పెట్టుకున్నాడా..?, సినిమాలో ఎంత అరిస్తే అంత పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాడా అనే ప్రశ్నలు వస్తాయి. మూవీ టీం ముందే చెప్పింది కదా… బాహుబలి లాంటి సినిమా అని… అందుకే బాహుబలి రేంజ్‌లో అరుపులు పెట్టాడు అని ఇప్పటికే ట్రోల్స్ వస్తున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×