The Raja Saab : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఒక సినిమా కోసం ఐదు సంవత్సరాలు కేటాయించటం అనేది మామూలు విషయం కాదు. రాజమౌళి విజన్ నమ్మి ప్రభాస్ మరో ప్రాజెక్ట్ చేయకుండా కేవలం బాహుబలి సినిమా కోసం దాదాపు 5 ఏళ్ళు కష్టపడ్డాడు. ఈ సినిమా కేవలం ప్రభాస్ కెరియర్ కి మాత్రమే ప్లస్ అవడం కాకుండా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా పెద్ద ప్లస్ అయింది. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలయింది. అయితే ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నడుస్తూ వస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసిన తర్వాత ఆ హీరో మరో దర్శకుడుతో పనిచేసి హిట్టు కొట్టడానికి కొంచెం టైం పడుతుంది.
పాన్ ఇండియా నిరాశ
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా తర్వాత, సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సాహో. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాకి నార్త్ లో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా రాధే శ్యామ్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా ఊహించిన విజయం సాధించలేకపోయింది. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలన్నిటిని సక్సెస్ఫుల్ గా డిసప్పాయింట్ చేశాడు ఓం రౌత్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది ఆ సినిమా.
ఇది రాజా సాబ్ పరిస్థితి
ప్రభాస్ కెరియర్ లో ఊహించని కాంబినేషన్ అంటే మారుతితో సినిమా చేయటం. మిడ్ రేంజ్ సినిమాలు చేసే మారుతి ప్రభాస్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. అయితే ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని నేను బయటికి తీస్తా అని మారుతి చెప్పినప్పుడు కొంతమందికి ఈ సినిమా ఏదో వర్కౌట్ అయ్యేటట్టు ఉంది అని అనిపించింది. ఎందుకంటే మారుతి స్ట్రెంత్ కామెడీ. ఇక ఈ సినిమాకి సంబంధించి 15 రోజులు రీ షూట్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇది ప్రభాస్ అభిమానులకు నిరాశ కలిగించే విషయం. ప్రభాస్ ఇటలీ నుంచి రాగానే దీన్ని మొదలు పెడదామని అనుకున్నారు. కానీ ప్రభాస్ ఇటలీ నుంచి రావడానికి ఇంకో రెండు నెలల పడుతుంది. దాదాపుగా రీ షూటింగ్ వలన 12 కోట్లు నష్టం వస్తున్నట్లు తెలుస్తుంది. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భరించక తప్పదు.
Also Read : Nikhil Siddarth : నిఖిల్ ఎక్కడ.. సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడా..?