Sonakshi Sinha : సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై తరచుగా రూమర్లు వినిపిస్తాయన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తిని చూపించడమే దానికి కారణం. ముందుగా వాళ్లపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తాయి. ఆ తరువాత పెళ్లెప్పుడు అంటూ ప్రశ్న మొదలవుతుంది. ఇక పెళ్లయ్యాక ప్రెగ్నెన్సీ అనే రూమర్స్ బయలుదేరుతాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ప్రెగ్నెంట్ అంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై సోనాక్షి సిన్హా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందిస్తూ తను కేవలం బరువు పెరగానని, ఈ మాత్రం దానికి ప్రెగ్నెన్సీ అంటూ రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ “అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను… నేను గర్భిణిని కాదు. కేవలం బరువు పెరిగాను. నా భర్తతో కలిసి ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది నేను ప్రెగ్నెంట్ అనుకుని అతడిని అభినందించారు. దీంతో ఆ నెక్స్ట్ డే నుంచి డైటింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఇలా ఎందుకు చేస్తారు? మా పెళ్లి జరిగి కేవలం 5 నెలలే అయ్యింది. ఇంకా మా బంధువులు మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంతో మేము చాలా బిజీగా ఉన్నాము. వివాహ బంధాన్ని ఆనందించకూడదా? ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? మేము కుక్కని ఎత్తుకొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తే, దాని కింద కూడా ప్రెగ్నెంటా? అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ ఫోటోకి కామెంట్ కి ఏమైనా సంబంధం ఉందా?” అంటూ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) అసహనం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఈ ఏడాది జూన్ 23న జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంట లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో, సోనాక్షి ఫ్యామిలీకి ఇది నచ్చలేదని అప్పట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇక పెళ్లి జరిగిన రెండు నెలలకే సోనాక్షి సిన్హా ఆస్పత్రిలో కనిపించడంతో అప్పుడు కూడా ఆమెపై ఇలాంటి రూమర్సే వినిపించాయి. కానీ నిజానికి సోనాక్షి సిన్హా తండ్రి అనారోగ్యంతో ఉండడంతో ఆమె అతడిని చూడడానికి ఆసుపత్రికి వెళ్ళింది. ఆ విషయంపై సోనాక్షి స్పందిస్తూ “ఇకపై ఎప్పుడు మేము హాస్పిటల్ కి వెళ్ళాలని అనుకోవట్లేదు. అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. అదొక్క ఆలోచనలోనే ఉంటున్నారు” అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రెగ్నెంట్ కాదంటూ రూమర్లకు ఈ ఇంటర్వ్యూలో సోనాక్షి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది సోనాక్షి సిన్హా “బడే మియా చోటే మియా” సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి.